యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్ష పదవి బాధ్యతల ను కమలా హారిస్ స్వీకరించిన సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందన లు తెలిపారు.
‘‘యుఎస్ఎ @VP గా ప్రమాణం స్వీకరించిన @KamalaHarris కు ఇవే అభినందన లు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. హారిస్ గారి తో కలసి భారతదేశం-యుఎస్ సంబంధాలను మరింత పటిష్టం చేయగలమని ఆశిస్తున్నాను. భారతదేశం- యుఎస్ఎ భాగస్వామ్యం ప్రపంచానికి ప్రయోజనకారి అవుతుంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Congratulations to @KamalaHarris on being sworn-in as @VP. It is a historic occasion. Looking forward to interacting with her to make India-USA relations more robust. The India-USA partnership is beneficial for our planet.
— Narendra Modi (@narendramodi) January 20, 2021