ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐర్లాండ్ తావోయిసీక్ (ప్రధాని) గా పదవీబాధ్యతలను స్వీకరించిన శ్రీ లియో వరాడ్ కర్ కు అభినందనలు తెలియజేశారు.
‘‘హెచ్.ఇ. శ్రీ లియో వరాడ్ కర్ ఐర్లాండ్ తావోయిసీక్ గా పదవీబాధ్యతలు స్వీకరించినందుకు ఆయనకు ఇవే నా అభినందనలు. భారతదేశం-ఐర్లాండ్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకుగాను తావోయిసీక్ శ్రీ వరాడ్ కర్ తో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations to H. E. Mr. Leo Varadkar on assuming office as Taoiseach of Ireland. @campaignforleo
— Narendra Modi (@narendramodi) June 15, 2017
I look forward to working with Taoiseach Varadkar to further strengthen India-Ireland relations. @campaignforleo
— Narendra Modi (@narendramodi) June 15, 2017