దేశీయం గా నిర్మించినటువంటి కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని, ఆ ఉపగ్రహం తో పాటే యుఎస్ఎ కు చెందిన 12కు పైగా బుల్లి ఉపగ్రహాల ను మోసుకొంటూ పోయిన పిఎస్ఎల్‌వి-సి47 ను విజయవంతం గా ప్రయోగించినందుకు యావత్తు ఇస్రో జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
“దేశవాళీ కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని మరియు యుఎస్ ఎ కు చెందినటువంటి డజను కు పైగా నానో శాటిలైట్ లను మోసుకుపోయిన పిఎస్ఎల్ వి-సి47 ను మరొక్క సారి విజయవంతం గా ప్రయోగించినందుకు యావత్తు ఇస్రో జట్టు ను నేను హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను.
ఉన్నత స్థాయి స్పష్టత తో కూడిన మన యొక్క ఇమేజింగ్ సామర్ధ్యాన్ని అధునాతనమైనది అయిన కార్టోశాట్-3 ఇనుమడింపచేయనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (‘ఇస్రో’) దేశ ప్రజలు మరొక్క మారు దేశ గర్వించేటట్టు చేసింది” అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
I heartily congratulate the entire @isro team on yet another successful launch of PSLV-C47 carrying indigenous Cartosat-3 satellite and over a dozen nano satellites of USA.
— Narendra Modi (@narendramodi) November 27, 2019