ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ,దేశీయ క్రయోజనిక్ ఇంజన్‌దశ గల జిఎస్ఎల్‌వి-ఎఫ్ 08ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.
“ దేశీయ క్రయోజనిక్ దశగల జిఎస్ఎల్‌వి – ఎఫ్ 08 ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో, ఇందులో పాలుపంచుకున్న వారికి అభినందనలు .జిశాట్- 6ఎ, ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది మొబైల్ అప్లికేషన్లకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది. దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు, సమున్నత నూతన శిఖరాలకు తీసుకువెళుతున్నందుకు ఇస్రోను చూసి గర్విస్తున్నాను. ”అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to @isro and other stakeholders on the successful launch of GSLV-F08 with indigenous cryogenic stage.
— Narendra Modi (@narendramodi) March 29, 2018
GSAT-6A, a communication satellite, will provide new possibilities for mobile applications. Proud of @isro for taking the nation towards new heights and a brighter future.
— Narendra Modi (@narendramodi) March 29, 2018