ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిఎస్ఎల్ వి-సి37 మరియు సిఎఆర్ టిఒఎస్ఎటి ఉపగ్రహంతో పాటు 103 నానో శాటిలైట్ లను విజయవంతంగా ప్రయోగించిన ఐఎస్ఆర్ఒ ను అభినందించారు.
“పిఎస్ఎల్ వి-సి37 మరియు సిఎఆర్ టిఒఎస్ఎటి ఉపగ్రహం, ఇంకా 103 నానో శాటిలైట్ లను విజయవంతంగా ప్రయోగించినందుకు
ఐఎస్ఆర్ఒ కు అభినందనలు.
ఈ ప్రశంసాయోగ్యమైన అసాధారణ కార్యాన్ని ఐఎస్ఆర్ఒ నెరవేర్చడం మన అంతరిక్ష శాస్త్రవేత్తల సముదాయానికి, అలాగే మన దేశానికి కూడా గర్వకారణమైన ఘడియ. మన శాస్త్రజ్ఞులకు యావత్తు భారతదేశం ప్రణమిల్లుతోంది.
అంతరిక్ష విభాగం కార్యదర్శితో నేను మాట్లాడాను; ఆయనకు అలాగే, ఈ రోజు అసాధారణమైన కార్యాన్ని సాధించిన శాస్త్రవేత్తల బృందానికి అంతటికీ అభినందనలు తెలియజేశాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations to @isro for the successful launch of PSLV-C37 and CARTOSAT satellite together with 103 nano satellites!
— Narendra Modi (@narendramodi) February 15, 2017
This remarkable feat by @isro is yet another proud moment for our space scientific community and the nation. India salutes our scientists.
— Narendra Modi (@narendramodi) February 15, 2017
Spoke to the Secretary, Department of Space and congratulated him & the entire team of scientists on today's exceptional achievement.
— Narendra Modi (@narendramodi) February 15, 2017