ఆస్ట్రేలియా లేబర్ పార్టీ విజయం సాధించినందుకు, ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు గౌరవనీయులు ఆంథోనీ అల్బనీస్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "ఆస్ట్రేలియా లేబర్ పార్టీ విజయం సాధించినందుకు, ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు, ఆంథోనీ అల్బనీస్ కి అభినందనలు! మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా పని చేయడానికి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య ప్రాధాన్యతల కోసం నేను ఎదురు చూస్తున్నాను."
Congratulations @AlboMP for the victory of the Australian Labor Party, and your election as the Prime Minister! I look forward to working towards further strengthening our Comprehensive Strategic Partnership, and for shared priorities in the Indo-Pacific region.
— Narendra Modi (@narendramodi) May 21, 2022