భారతదేశ ఒకటో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన జనరల్ శ్రీ బిపిన్ రావత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘మనం నూతన సంవత్సరాన్ని మరియు నూతన దశాబ్ది ని మొదలుపెడుతూ ఉన్న తరుణం లో, జనరల్ శ్రీ బిపిన్ రావత్ రూపం లో భారతదేశాని కి ఒకటో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లభించడం నాకు ఎంతో సంతోషం గా ఉంది. ఆయన కు ఇవే నా అభినందన లు; ఈ కర్తవ్య పాలన లో ఆయన కు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన ఎంతో ఉత్సాహం తో భారతదేశాని కి సేవల ను అందించినటువంటి ఒక విశిష్ట అధికారి.
ఒకటో సిడిఎస్ పదవీ బాధ్యతల ను స్వీకరిస్తూ ఉన్న వేళ లో, మన దేశం కోసం వారి యొక్క ప్రాణాల ను సమర్పణం చేసి తద్వారా దేశాని కి సేవ చేసినటువంటి వారు అందరి కి కూడాను నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. కర్ గిల్ లో పోరాటం సలిపినటువంటి పరాక్రమశాలి సిబ్బంది ని నేను జ్ఞప్తి కి తెచ్చుకొంటున్నాను. ఆ పోరాటం జరిగిన అనంతరం, మన సైన్యాన్ని సంస్కరించడం గురించి అనేక చర్చ లు సాగి, నేటి చరిత్రాత్మక పరిణామాని కి దారి తీశాయి.
2019వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నాడు ఎర్ర కోట బురుజుల మీది నుండి నేను ప్రసంగిస్తూ, ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను భారతదేశం ఏర్పాటు చేసుకొంటుందని ప్రకటించాను. ఈ సంస్థ మన సైనిక దళాల ను ఆధునికీకరించే మహత్తరమైనటువంటి బాధ్యత ను తన భుజస్కందాల పైన వేసుకొంటున్నది. ఇది 1.3 బిలియన్ భారతీయుల యొక్క ఆశల ను మరియు ఆకాంక్షల ను కూడా ప్రతిబింబిస్తుంది.
అపేక్షిత సైనిక ప్రావీణ్యం కలిగిన సైనిక వ్యవహారాల విభాగాన్ని ఏర్పాటు చేయడం మరియు సిడిఎస్ పదవి ని సంస్థాగతీకరించడం ఒక మహత్వపూర్ణమైనటువంటి మరియు సమగ్రమైనటువంటి సంస్కరణ గా ఉంది. ఇది ఎప్పటికప్పుడు పరివర్తన కు లోనయ్యేటటువంటి ఆధునిక రణతంత్ర సంబంధిత సవాళ్ళ కు మన దేశం ఎదురొడ్డి నిలవడం లో సహాయకారి గా ఉండగలదు’’ అంటూ ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
I am delighted that as we begin the new year and new decade, India gets its first Chief of Defence Staff in General Bipin Rawat. I congratulate him and wish him the very best for this responsibility. He is an outstanding officer who has served India with great zeal.
— Narendra Modi (@narendramodi) January 1, 2020
As the first CDS takes charge, I pay homage to all those who have served and laid down their lives for our nation. I recall the valiant personnel who fought in Kargil, after which many discussions on reforming our military began, leading to today’s historic development.
— Narendra Modi (@narendramodi) January 1, 2020
On 15th August 2019, from the ramparts of the Red Fort, I announced that India will have a Chief of Defence Staff. This institution carries tremendous responsibility of modernizing our military forces. It would also reflect the hopes and aspirations of 1.3 billion Indians.
— Narendra Modi (@narendramodi) January 1, 2020
Creation of the Department of Military Affairs with requisite military expertise and institutionalisation of the post of CDS is a momentous and comprehensive reform that will help our country face the ever-changing challenges of modern warfare.
— Narendra Modi (@narendramodi) January 1, 2020