భారతదేశం 400 బిలియన్ డాలర్ విలువ గల వస్తురూప ఎగుమతుల మహత్త్వాకాంక్షభరిత లక్ష్యాన్ని అనుకొన్న కాలం కంటే 9 రోజుల ముందుగానే సాధించడం తో రైతుల ను, నేత శ్రమికుల ను, ఎమ్ఎస్ఎమ్ఇ లను, తయారీదారు సంస్థల ను, ఎగుమతిదారు సంస్థల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశం 400 బిలియన్ డాలర్ విలువైన వస్తు రూప ఎగుమతుల ను సాధించాలి అనేటటువంటి ఒక మహత్త్వాకాంక్షయుక్తమైన లక్ష్యాన్ని పెట్టుకొని, మరి ఆ లక్ష్యాన్ని మొట్టమొదటి సారిగా సాధించింది. ఈ సఫలత కు గాను మన రైతుల ను, నేత శ్రమికుల ను, ఎమ్ఎస్ఎమ్ఇ లను, తయారీదారు సంస్థల ను, ఎగుమతిదారు సంస్థల ను నేను అభినందిస్తున్నాను.
ఇది మన ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణం లో ఒక కీలకమైనటువంటి మైలురాయి గా ఉంది. #LocalGoesGlobal’’ అని పేర్కొన్నారు.
India set an ambitious target of $400 Billion of goods exports & achieves this target for the first time ever. I congratulate our farmers, weavers, MSMEs, manufacturers, exporters for this success.
— Narendra Modi (@narendramodi) March 23, 2022
This is a key milestone in our Aatmanirbhar Bharat journey. #LocalGoesGlobal pic.twitter.com/zZIQgJuNeQ