ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో వాటిల్లిన ప్రాణనష్టం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తన వ్యథను వెలిబుచ్చుతూ..
“పట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన కారణంగా జరిగిన ప్రాణనష్టం నాకు కలిగించిన మానసిక క్షోభ మాటలలో చెప్పలేకపోతున్నాను. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల బాధలో పాలుపంచుకొంటున్నాను.
రైలు ప్రమాద విషాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రైల్వే మంత్రి శ్రీ సురేశ్ ప్రభుతో మాట్లాడాను; ఆయన స్వయంగా పరిస్థితిని దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు” అన్నారు.
Anguished beyond words on the loss of lives due to the derailing of the Patna-Indore express. My thoughts are with the bereaved families.
— Narendra Modi (@narendramodi) November 20, 2016
Prayers with those injured in the tragic train accident. I've spoken to @sureshpprabhu, who is personally monitoring the situation closely.
— Narendra Modi (@narendramodi) November 20, 2016