ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
“ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం నన్నెంతో వేదనకు గురిచేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇదే నా సంతాపం. గాయపడిన వారు కోలుకోవాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Pained by the loss of lives due to an accident in AP’s Chittoor dist. Condolences to families of the deceased & prayers with the injured: PM
— PMO India (@PMOIndia) April 21, 2017