పార్లమెంట్ ఉభయ సభల లో ఒకటైన రాజ్య సభ పూర్వ సభ్యుడు (ఎంపి) శ్రీ డి. శ్రీనివాస్ ఈ రోజు న మరణించిన సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ డి. శ్రీనివాస్ గారిని ఆయన చేసిన ప్రజాసేవ కు మరియు పేదల అభ్యున్నతి కి గాను ఆయన చేసిన ప్రయాసలకు గాను స్మరించుకోవడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో :
‘‘పూర్వ ఎంపి శ్రీ డి. శ్రీనివాస్ గారి నిష్క్రమణ వార్త తెలిసి దు:ఖించాను. ప్రజాసేవ లో ఆయన గడిపిన దీర్ఘ సంవత్సరాలకు గాను మరియు పేదల కు సాధికారిత ను కల్పించడం కోసం ఆయన చేసిన ప్రయాసలకు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఈ దు:ఖ ఘడియల లో ఆయన కుటుంబానికి మరియు ఆయన మద్దతుదారులకు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’ అని పేర్కొన్నారు.
Saddened by the passing away of former MP Shri D. Srinivas Garu. He will be remembered for his long years in public service and efforts to empower the poor. My thoughts are with his family and supporters in this hour of grief: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 29, 2024