ఈజిప్టు లోని ఒక ప్రార్థన స్థలంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని క్రూరమైన దాడి గా ప్రధాన మంత్రి పేర్కొటూ, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిర్దోషులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై, దాని అన్ని రూపాలలోను, పోరాడడానికి భారతదేశం ఈజిప్టు కు దృఢమైన మద్ధతును అందిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
“ఈజిప్టు లో ప్రార్థన స్థలం పై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు ఇదే మా ప్రగాఢ సంతాపం. ఉగ్రవాదం పై- దాని అన్ని రూపాలతోను- పోరాడడానికి భారతదేశం దృఢ సంకల్పంతో కూడినటువంటి మద్ధతును అందిస్తుంది. అలాగే ఈజిప్టు ప్రభుత్వానికి మరియు ప్రజలకు భారతదేశం వెన్నంటి నిలుస్తుంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Strongly condemn the barbaric terrorist attack on a place of worship in Egypt. Our deep condolences at the loss of innocent lives. India resolutely supports the fight against all forms of terrorism and stands with the people as well as Government of Egypt.
— Narendra Modi (@narendramodi) November 24, 2017