దేశంలోని అనేక ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక సంఘటనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ఖండించారు.
‘‘ఇవాళ చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు చాలా బాధ కలిగించాయి.
ఈ హింసను నేను తీవ్రంగా ఖండిస్తూ- శాంతి నెలకొనేందుకు సహకరించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. శాంతిభద్రతలను చాలా శ్రద్ధగా పర్యవేక్షిస్తున్నాం. ఈ మేరకు జాతీయ భద్రత సలహాదారు, హోంశాఖ కార్యదర్శులతోనూ నేను అన్ని పరిస్థితులనూ సమీక్షించాను.
సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అహర్నిశలూ కృషి చేయాలని అధికారులను ఆదేశించాను.
ఈ దిశగా అవసరమైన సహయ, సహకారాలను అందించాలని కూడా చెప్పాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
The instances of violence today are deeply distressing. I strongly condemn the violence & urge everyone to maintain peace.
— Narendra Modi (@narendramodi) August 25, 2017
The law & order situation is being closely monitored. I reviewed the situation with the NSA & Home Secretary.
— Narendra Modi (@narendramodi) August 25, 2017
Urged officials to work round the clock to restore normalcy and provide all possible assistance that is required.
— Narendra Modi (@narendramodi) August 25, 2017