ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాబూల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు. దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
“కాబూల్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం తెలుపుతున్నాను. ఉగ్రవాదంపై అఫ్గానిస్తాన్ సాగిస్తున్న పోరాటంలో భారతదేశం అఫ్గానిస్తాన్ కు అండగా నిలబడుతుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.
Strongly condemn the terror attack in Kabul & condole loss of innocent lives. India stands with Afghanistan in its fight against terrorism.
— Narendra Modi (@narendramodi) January 10, 2017