అఫ్ గానిస్తాన్ లోని కాబుల్ లో గల కార్తే పార్ వన్ గురుద్వారా పై జరిగిన పిరికిపందతనం తో కూడినటువంటి ఉగ్రవాద దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. భక్త జనం సురక్షితం గా, శ్రేయం గా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆ పరమాత్మ ను ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కాబుల్ లో గల కార్తే పార్ వన్ గురుద్వారా పై పిరికితనం నిండినటువంటి ఉగ్రవాద దాడి ఘటన జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఈ క్రూరమైనటువంటి దాడి ని నేను ఖండిస్తున్నాను. భక్తజనం సురక్షితం గాను, క్షేమం గాను ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
Shocked by the cowardly terrorist attack against the Karte Parwan Gurudwara in Kabul. I condemn this barbaric attack, and pray for the safety and well-being of the devotees.
— Narendra Modi (@narendramodi) June 18, 2022