ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లో జరిగిన సహాయక కార్యదర్శులు (2017వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ ల) బ్యాచ్ ముగింపు సమావేశం లో పాలు పంచుకొన్నారు.
ప్రధాన మంత్రి సమక్షం లో అధికారులు పలు నివేదికల ను సమర్పించారు. వాటి ఇతివృత్తాల లో పారదర్శకత్వాని కి, వేగవంతమైన అందజేత కు సంబంధించినటువంటి వివిధ పాలనాపరమైన పరిష్కార మార్గాల తో పాటు ఆకాంక్షభరిత జిల్లాల లో పరివర్తన ను తీసుకురావడానికి సంబంధించిన ఇతివృత్తాలు కూడా చోటు చేసుకొన్నాయి.
కొత్త కొత్త ఆలోచనలు, నవీన భావన లు మరియు నూతన దృష్టి కోణాల ను స్వాగతించండి అంటూ అధికారుల ను ప్రధాన మంత్రి ఉత్సాహపరిచారు. అనేక మార్గాల నుండి ప్రతిస్పందన లను తీసుకొని, వాటిని విశ్లేషించి, తమ ప్రణాళిక లో భాగం చేసుకోవాలని కూడా ప్రధాన మంత్రి చెప్పారు. నిరంతరం నేర్చుకొంటూ ఉండవలసిందిగాను, ఆసక్తి ని పెంపొందింప చేసుకోవలసిందిగాను అధికారుల కు ఆయన సూచించారు.
ప్రధాన మంత్రి అధికారుల తో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి కి సేవాభావం సర్వోపరి గా ఉండాలని, ఎందుకంటే అది తటస్థత్వాన్ని వెలికితెస్తుందని ఉద్భోదించారు.
ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఆయన స్పష్టం చేస్తూ, ప్రభుత్వ పథకాలు పక్కా గా అమలులోకి రావడం కోసం సమష్టి ప్రయత్నాలు చేయాలని యువ అధికారుల ను కోరారు. సహాయక కార్యదర్శి గా ఉన్న క్రమం లో వారికి ఎదురైన ఉత్తమమైనటువంటి అనుభవాల ను మదిలో ఇముడ్చుకొని ముందుకు పోవాలని కూడా ఆయన సూచించారు.
యువ అధికారుల నివేదిక లు బాగున్నాయని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, వారు మునుముందు ఉత్తమ పాత్ర ను పోషించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ సాఫల్యం దేశ ప్రజల కు ఎంతో ముఖ్యం. మీ విజయం ఎంతో మంది ప్రజల జీవితాల లో పరివర్తన ను తీసుకొనిరాగలదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.