ఫోనీ తుఫాను సంబంధిత సన్నాహాల ను సమీక్షించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈ రోజు న నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి కేబినెట్ సెక్రటరీ, ప్రధాన మంత్రి కి ప్రధాన కార్యదర్శి, ప్రధాన మంత్రి కి అదనపు ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, ఇంకా పిఎంఒ మరియు ఐఎండి, ఎన్ డిఆర్ఎఫ్, ఎన్ డిఎంఎ తదితర సంస్థల లోని సీనియర్ అధికారులు హాజరయ్యారు.
తుఫాను పయనించగల మార్గాన్ని గురించి, ఈ సందర్భం గా ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకురావడమైంది; అలాగే, ప్రస్తుతం సాగుతున్నటువంటి ముందస్తు జాగ్రత్తల ను గురించి, చేపడుతున్నటువంటి సన్నాహక చర్యలను గురించి కూడా ఆయన కు వివరించడమైంది.
వీటి లో భాగం గా చాలినన్ని వనరులను సమకూర్చుకోవడం; సాయుధ బలగాలు మరియు ఎన్‌డిఆర్ఎఫ్ ల నుండి బృందాల ను మోహరించడం; త్రాగునీటి సదుపాయాన్ని కల్పించడం; విద్యుత్తు, ఇంకా టెలికాం సేవలపై ప్రభావం పడితే గనక ఆ సేవలను పునరుద్ధరించడం కోసం సహకారిక వ్యవస్థ లను అందుబాటు లో వుంచుకోవడం వంటివి ఉన్నాయి.
రూపుదాల్చుతున్న స్థితిగతుల ను సమీక్షించిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం లోని సీనియర్ అధికారుల ను ప్రభావిత రాష్ట్రాల అధికారుల తో ఎప్పటికప్పుడు సన్నిహిత సమన్వయాన్ని ఏర్పరచుకోవలసిందిగాను, నివారక చర్యల ను తీసుకోవడం కోసం మరియు అవసరపడిన మేరకు రక్షణ, సహాయక కార్యకలాపాల కు సంబంధించిన దీటైన చర్యల ను తీసుకోవలసిందిగాను ప్రధాన మంత్రి ఆదేశించారు.
Chaired a high level meeting to review the preparedness relating to Cyclone Fani. The Central Government is ready to provide all possible assistance that would be required.
— Chowkidar Narendra Modi (@narendramodi) May 2, 2019
Prayers for the safety and well-being of our citizens. pic.twitter.com/GLoCzmV1io