ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 94వ సివిల్ స‌ర్వీసెస్ ఫౌండేశ‌న్ కోర్సు తాలూకు అధికారి శిక్ష‌ణార్థులు 430 మంది తో ముఖాముఖి మాట్లాడారు. ఈ కోర్సు ను మ‌సూరీ కి చెందిన లాల్ బ‌హాదుర్ శాస్త్రి నేశ‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేశ‌న్ తో పాటు సిబ్బంది మ‌రియు శిక్ష‌ణ విభాగం గుజ‌రాత్ లోని కేవ‌డియా లో ఏర్పాటు చేశాయి.

|

వారం రోజుల పాటు సాగే విశిష్ట‌మైన సంపూర్ణ ఫౌండేశ‌న్ కోర్సు ‘ఆరంభ్‌’ ను గురించి ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకురావడమైంది. అధికారి శిక్ష‌ణార్థులు ఒక ప్ర‌త్య‌క్ష ముఖాముఖి స‌ద‌స్సు లో భాగం గా అయిదు ఇతివృత్తాల పై వారి వారి నివేదిక‌ల‌ ను స‌మ‌ర్పించారు. ఆ ఇతివృత్తాల లో- వ్య‌వ‌సాయ మ‌రియు గ్రామీణ సాధికారిత‌ కల్పన, ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధిత సంస్క‌ర‌ణ‌ లు మ‌రియు విధాన రూప‌క‌ల్ప‌న, స్థిర‌త్వం క‌లిగిన గ్రామీణ నిర్వ‌హ‌ణ మెల‌కువ‌లు, స‌మ్మిళిత ప‌ట్ట‌ణీక‌ర‌ణ మ‌రియు విద్య యొక్క భ‌విత‌వ్యం- ఉన్నాయి.

ప్ర‌పంచ బ్యాంకు చైర్‌ మ‌న్ శ్రీ డేవిడ్ మల్‌ పాస్‌, ప్ర‌ధాన మంత్రి కి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి, కేబినెట్ సెక్ర‌ట‌రి, ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫ్యూచ‌ర్ ఎండ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ డైవ‌ర్సిటీ లకు చెందిన విశ్లేష‌కులు మ‌రియు ప‌రిశోధ‌క విద్యార్థులు కొన్ని అంశాల పై నిర్వ‌హించిన‌టువంటి వివిధ స‌ద‌స్సుల యొక్క ముఖ్యాంశాల ను కూడా ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకురావడమైంది.

|

త‌ద‌నంత‌రం జరిగిన ముఖాముఖి స‌భ లో, ప్ర‌ధాన మంత్రి ఈ కోర్సు ను ఇండియ‌న్ సివిల్ స‌ర్వీసెస్ కు వ్య‌వ‌స్థాప‌క పిత గా ప‌రిగ‌ణిస్తున్న స‌ర్ దార్ వ‌ల్ల‌భ్ భాయ్‌ ప‌టేల్ యొక్క జ‌యంతి అయిన అక్టోబ‌రు 31వ తేదీన నిర్వ‌హించ‌డం నిజాని కి అభినందనార్హమని పేర్కొన్నారు.

‘‘ఇండియ‌న్ సివిల్ స‌ర్వీసు స‌ర్దార్ ప‌టేల్ గారి కి ఎంతగానో రుణ‌ప‌డివుంది. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ కొలువైన ఈ కేవ‌డియా లో ఉండి మ‌న దేశ ప్ర‌జ‌ల కు ఎంతో కొంత మేలు ను చేసేందుకు త‌గినటువంటి శ‌క్తి ని మ‌రియు ప్రేర‌ణ ను మ‌నమంద‌ర‌మూ ఆర్జించెద‌ముగాక‌, భార‌త‌దేశాన్ని అయిదు ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఆవిష్క‌రించే దిశ లో కృషి చేద్దాం రండి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

|

ఆరంభ్ ఫౌండేశ‌న్ కోర్సు ప‌రిపాల‌న లో రూపావ‌ళి సంబంధ మార్పు ను ఆవిష్కరించే సామ‌ర్థ్యం కల ఒక విశిష్టమైన భ‌విష్య‌ కేంద్రిత కోర్సు అని ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణించారు.

‘‘ ‘ఆరంభ్’ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ కోర్సు దేశ కేంద్రితమైనటువంటి మ‌రియు భ‌విష్య‌త్తు ప్ర‌ధాన‌మైనటువంటి కోర్సు. ఇది ప‌రిపాల‌న లో రూపావ‌ళి ప‌రం గా ఒక ప‌రివ‌ర్త‌న ను ఆవిష్క‌రించగలదు. దీని ద్వారా అడ్డుగోడ‌ల ను ఛేదించే ప‌ని జ‌ర‌గాలి. అంత‌క‌న్నా క‌ల‌సి ప‌ని చేసే- అది కూడా సంపూర్ణ‌మైన రీతి లో- ముందుకు సాగాలి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

|

ప‌రిశీలించే ప‌ద్ధ‌తి ని మార్చుకోవాల‌ని శిక్ష‌ణార్థుల‌ కు ఆయ‌న ఉద్భోదించారు. ఒక్కొక్క‌ సారి ప‌ద‌జాలం లో మార్పు సైతం దృక్ప‌థం లో ప‌రివ‌ర్తన ను తీసుకు రావ‌డం లో తోడ్ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

‘‘మ‌నం విష‌యాల‌ ను ఏ విధం గా చూస్తామో ఆ తీరు ను మార్చుకొందాము. మార్పున‌కు లోనైన ప‌ద‌జాలం కూడా స‌హాయాన్ని అందించేట‌టువంటిదే. ఇదివ‌ర‌కు ప్ర‌జ‌లు వెనుక‌బ‌డిన జిల్లాల‌ ను గురించి మాట్లాడుకొనే వారు. ఈ రోజు న మ‌నం ఆకాంక్ష‌భ‌రిత జిల్లాల ను గురించి మాట్లాడుకొంటున్నాము. ఏ ఉద్యోగం అయినా శిక్షాత్మ‌క‌మైంది గా ఎందుకు ఉండాలి. దాని ని ఒక అవ‌కాశ‌భ‌రిత ఉద్యోగం గా ఎందుకు చూడ‌కూడదు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

|

అధికారి శిక్ష‌ణార్థులు ప్ర‌ద‌ర్శించిన నిబ‌ద్ధ‌త ను మ‌రియు వారి యొక్క నవీన ఆలోచ‌న‌ల ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. ఈ విశిష్ట‌మైన శిక్ష‌ణ కోర్సు వ‌ల్ల ల‌భించిన జ్ఞానం వారి భావి వృత్తి జీవ‌నం లో ఉప‌యోగ‌కారి గా నిరూపితం అవుతుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. వారు వ్య‌వ‌స్థ లో అధికార‌ క్ర‌మాన్ని మ‌రియు అడ్డుగోడ‌ల ను తొల‌గించేందుకు పాటు ప‌డాలి అని ఆయ‌న అన్నారు.

అధికార క్ర‌మం మ‌రియు అడ్డుగోడ‌లు అనేవి మ‌న వ్య‌వ‌స్థ కు ఉప‌యోగ‌ప‌డ‌వు. ‘‘మ‌నం ఎవ‌రం అయినా స‌రే, మ‌నం ఎక్క‌డ ఉన్నా స‌రే, దేశ ప్ర‌జ‌ల కోసం మ‌నం అంద‌ర‌మూ క‌ల‌సి క‌ట్టుగా కృషి చేసే తీరాలి’’ అని ప్ర‌ధాన మంత్రి ఉద్భోదించారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's apparel exports clock double digit growth amid global headwinds

Media Coverage

India's apparel exports clock double digit growth amid global headwinds
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 ఏప్రిల్ 2025
April 18, 2025

Aatmanirbhar Bharat: PM Modi’s Vision Powers India’s Self-Reliant Future