ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి 2018 వ సంవత్సరపు సియోల్ శాంతి బహుమతి ని ప్రదానం చేయాలని సియోల్ శాంతి బహుమతి సంఘం నిర్ణయించింది. ఆయన ప్రపంచం లోకెల్లా శర వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ లో ఆర్థిక వృద్ధి కి ఊతాన్ని అందించడం ద్వారా భారతదేశ ప్రజల మానవ వికాసాన్ని వర్ధిల్ల చేస్తున్నందుకు, ప్రపంచ ఆర్థిక వృద్ధి ని పెంచినందుకు, అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచడం లో కనబరుస్తున్న అంకిత భావానికి మరియు అలాగే, అవినీతి కి వ్యతిరేకంగా, సామాజిక సమైక్యత దిశ గా ఆయన చేస్తున్న కృషి ని గుర్తిస్తూ ఈ బహుమతి ని ఇవ్వనున్నారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ ని 2018వ సంవత్సరపు సియోల్ శాంతి బహుమతి కి ఎంపిక చేస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కి ఆయన అందించిన తోడ్పాటు ను పురస్కార సంఘం గుర్తించింది. ధనికులకు, పేదలకు మధ్య సామాజిక మరియు ఆర్థిక అసమానత ను తగ్గించిన ఘనత ‘మోదీనామిక్స్’ కు చెందుతుందని, నోట్ల చట్టబద్ధత రద్దు మరియు అవినీతి వ్యతిరేక చర్య ల ద్వారా ప్రభుత్వాన్ని స్వచ్ఛత దిశ గా నడపడం లో ప్రధాన మంత్రి చేపట్టిన కార్యక్రమాల ను సంఘం ప్రశంసించింది. ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’, ఇంకా ‘మోదీ డాక్ట్రిన్’ లలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల తో ఒక సానుకూల విదేశాంగ విధానాన్ని అవలంబించడం ద్వారా ప్రాంతీయ శాంతి కి మరియు ప్రపంచ శాంతి కి ప్రధాన మంత్రి తోడ్పడ్డారని కూడా సంఘం పేర్కొంది. ఈ పురస్కారాన్ని అందుకొన్న వారిలో ప్రధాన మంత్రి శ్రీ మోదీ పధ్నాలుగో వ్యక్తి.
భారతదేశం కొరియా గణతంత్రం తో తన భాగస్వామ్యాన్ని గాఢతరం చేసుకొంటున్న నేపథ్యం లో, ఈ ప్రతిష్టాత్మక సమ్మానానికి అర్హుని గా తనను పరిగణించినందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేస్తూ ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు సమ్మతి ని తెలిపారు. ఈ పురస్కారాన్ని సియోల్ పీస్ ప్రైజ్ ఫౌండేశన్ ఇరు వర్గాల కు అనువుగా ఉండేటటువంటి వేళ లో బహూకరిస్తుంది.
పూర్వరంగం
ప్రపంచం నలుమూల ల నుండి 160 దేశాలు కొరియా గణతంత్రం రాజధాని సియోల్ లో నిర్వహించిన 24వ ఒలంపిక్ ఆటల విజయానికి సంకేతం గా సియోల్ శాంతి బహుమతి ని 1990 వ సంవత్సరం లో స్థాపించారు. అప్పటి ఒలంపిక్ క్రీడ లలో పాలుపంచుకొన్న దేశాలు మైత్రికి, సామరస్యానికి పెద్ద పీట ను వేయడం తో పాటు ఎల్లెడలా శాంతియుతమైన వాతావరణం, రాజీ వైఖరులు నెలకొనేందుకు వాటి వంతు సహకారాన్ని అందించాయి. సియోల్ శాంతి బహుమతి ని కొరియా ద్వీపకల్ప ప్రాంతం లోను, ప్రపంచం లోని మిగతా భూ భాగం లోను శాంతి కోసం కొరియా ప్రజలు పడుతున్న తపన కు ఒక నిదర్శనం గా ఏర్పాటు చేయడం జరిగింది.
దేశాల మధ్య రాజీ కి, మానవ జాతి సామరస్యానికి మరియు ప్రపంచ శాంతి కి తోడ్పాటు ను అందించడం ద్వారా తమ ప్రభావాన్ని ప్రసరింపచేసే వ్యక్తులను ఎంపిక చేసి- రెండు సంవత్సరాల కు ఒక పురస్కారం వంతు న- సియోల్ శాంతి బహుమతి ని అందజేస్తున్నారు. ఇంతవరకు ఈ బహుమతి ని గ్రహించిన వారి లో ఐరాస పూర్వ సెక్రటరి జనరల్ శ్రీ కోఫీ అన్నాన్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మర్కెల్ గారు ల వంటి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులైన వారి తో పాటు ‘డాక్టర్ వితౌట్ బార్డర్స్’, ఇంకా ‘ఆక్స్‌ఫేమ్’ ల వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ఉపశమనకారక సంస్థ లు కూడా ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుండి 1300 లకు పైగా నామినేటర్లు ప్రతిపాదించిన ఒక వంద కు పైగా అభ్యర్థుల ను మదింపు చేసిన అనంతరం బహుమతి ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి కట్టబెట్టాలని పురస్కార సంఘం నిర్ణయం తీసుకొంది. ఆయన ను ‘2018 వ సియోల్ శాంతి బహుమతి కి పరిపూర్ణుడైన అభ్యర్థి’ అని సంఘం తెలిపింది.