ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జ‌రిగిన నేశ‌న‌ల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజ‌ర‌య్యారు.  ర్యాలీ లో గౌరవ వంద‌నాన్ని ప్ర‌ధాన మంత్రి ప‌రిశీలించారు.  వివిధ ఎన్‌ సిసి ద‌ళాలతో పాటు ఇత‌ర మిత్ర దేశాల కు మ‌రియు ఇరుగు పొరుగు దేశాల కు చెందిన సైనిక విద్యార్థులు కూడా పాలుపంచుకొన్న సైనిక క‌వాతు ను ఆయన సమీక్షించారు. 

బోడో మరియు బ్రు-రియాంగ్ ఒప్పందం

ఈశాన్య ప్రాంతం అభివృద్ధి కృషి ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఇంతకుముందు ఈ ప్రాంతాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డ‌మైంద‌ని, ఈ ప్రాంతం ఉగ్ర‌వాదం తో యుద్ధాన్ని జ‌రుపుతూ, హింస‌ లో అమాయ‌కులు మ‌ర‌ణించార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ ప్ర‌భుత్వం ఒక ప్రక్క ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కి ఇదివ‌ర‌కు ఎరుగ‌న‌టువంటి ప్ర‌ణాళిక‌ల ను ఆరంభించిందని, మ‌రో ప్ర‌క్క సంబంధిత వ‌ర్గాలు అన్నిటితో అర‌మ‌రిక‌లు లేన‌టువంటి సంభాష‌ణ ను మొద‌లు పెట్టిందని ఆయ‌న తెలిపారు.  దీని ఫ‌లిత‌మే బోడో ఒప్పందం.  యువ భార‌త‌దేశం యొక్క ఆలోచ‌న ఇది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

త్రిపుర మ‌రియు మిజోరమ్ ల మ‌ధ్య బ్రు-రియాంగ్ ఒప్పందం కుదిరిన అనంత‌రం, బ్రు ఆదివాసీల కు చెందిన 23 సంవ‌త్స‌రాల స‌మ‌స్య కు ప‌రిష్కారం ల‌భించింది.  ఇదీ యువ భార‌త్ దేశం యొక్క ఆలోచ‌న‌ల స‌ర‌ళి.  మేము ప్ర‌తి ఒక్క‌రి ని వెంట‌బెట్టుకొని, ప్ర‌తి ఒక్క‌రి అభివృద్ధి కి పాటుప‌డుతూ, ప్ర‌తి ఒక్క‌రి విశ్వాసాన్ని చూర‌గొంటూ, దేశాన్ని ముందుకు న‌డిపిస్తున్నాము అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

|

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం గురించిన స‌త్యాన్ని తెలుసుకోవ‌డం దేశ యువ‌త కు అవ‌స‌రం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  స్వాతంత్య్రం నాటి నుండి పాకిస్తాన్‌, బాంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్ ల లోని హిందువులు, సిఖ్కు లు, ఇంకా ఇత‌ర అల్ప‌సంఖ్యాక వ‌ర్గాల వారికి అవ‌స‌ర‌మైతే భార‌త‌దేశాని కి రావ‌చ్చు అంటూ స్వ‌తంత్ర భార‌త‌దేశం మాట ఇచ్చింది. వారి వెన్నంటి భార‌త‌దేశం నిల‌బ‌డుతుంది అని ఆయ‌న వాగ్దానం చేశారు.  గాంధీజీ కోరుకున్నది కూడా ఇదే.  అలాగే, 1950వ సంవ‌త్స‌రం లో జ‌రిగిన నెహ్రూ-లియాక‌త్ ఒప్పందం యొక్క స్ఫూర్తి కూడా ఇదే అని ఆయ‌న వివ‌రించారు.  ‘‘ఈ దేశాల లో వారి యొక్క విశ్వాసం కార‌ణం గా కష్టాలకు లోనైన ప్ర‌జ‌ల కు ఆశ్ర‌యాన్ని ఇచ్చి, వారికి భార‌త‌దేశ పౌర‌స‌త్వాన్ని క‌ట్ట‌బెట్ట‌వ‌ల‌సిన బాధ్య‌త భార‌త‌దేశాని ది.  అయితే అటువంటి ప్ర‌జ‌ల ను వేల సంఖ్య‌ లో తిప్పి పంపించేయ‌డ‌మైంది’’ అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ‘‘అటువంటి ప్ర‌జ‌ల కు చ‌రిత్ర ప‌రం గా జ‌రిగిన అన్యాయాన్ని ఆపివేయ‌డం కోసం ప్రస్తుతం మా ప్ర‌భుత్వం పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చి.  భార‌త‌దేశం చేసిన పాత వాగ్ధానాన్ని నెర‌వేర్చ‌డం కోసం అటువంటి ప్ర‌జ‌ల కు భార‌త‌దేశ పౌర‌స‌త్వాన్ని ఇవ్వ‌నుంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

విభ‌జ‌న కాలం లో ఎంతో మంది ప్ర‌జ‌లు భార‌త‌దేశాన్ని వీడి వెళ్ళిన‌ప్ప‌టి కి ఇక్క‌డి ఆస్తుల పైన వారికి గల హ‌క్కు లను నిశ్చితం గా ప్రకటించారని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  కోట్లాది రూపాయ‌ల విలువ కలిగిన ఈ ఆస్తుల పై భార‌త‌దేశాని కి హ‌క్కు ఉన్న‌ప్ప‌టి కి, ద‌శాబ్దుల త‌ర‌బ‌డి శ‌త్రు ఆస్తి ని ప‌క్క‌న పెట్టి ఉంచ‌డం జ‌రిగిందని ఆయ‌న అన్నారు.  శ‌త్రువుల ఆస్తి చ‌ట్టాన్ని వ్య‌తిరేకించిన‌టువంటి వారే ప్ర‌స్తుతం పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని వ్య‌తిరేకించ‌డానికి ముందుకు వ‌చ్చారు అని ఆయ‌న అన్నారు.

|

భారత బాంగ్లాదేశ్ స‌రిహ‌ద్దు త‌గాదా

భార‌త‌దేశం మ‌రియు బాంగ్లాదేశ్ ల స‌రిహ‌ద్దు ప్రాంతాల లోని త‌గాదా ను తీర్చేందుకు ఎటువంటి వాస్తవిక కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రుగ‌లేద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  స‌రిహ‌ద్దు ల తాలూకు వివాదం ఉన్నతంతవరకు చొర‌బాటు ఆగిపోదు అని ఆయ‌న చెప్పారు.  త‌గాదా ను తీర్చ‌కుండా అట్టే పెట్టారంటే– చొర‌బాటుదారుల కు బార్లా తెర‌చిన దారి ల‌భిస్తుంది– మీరు మీ రాజ‌కీయాల ను న‌డపవచ్చు. 

|

బాంగ్లాదేశ్ తో స‌రిహ‌ద్దు త‌గాదా ను– ప‌ర‌స్ప‌ర వాద‌నల ను విన‌డం, అర్థం చేసుకోవ‌డం, మ‌రి రెండు దేశాల కూ అంగీకార‌మైన‌టువంటి ఒక ప‌రిష్కారాన్ని క‌నుగొన‌డం ద్వారా– ఈ ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించింది అని ఆయ‌న తెలిపారు.  ప్ర‌స్తుతం ఒక్క స‌రిహ‌ద్దు త‌గాదా ను తీర్చ‌డ‌మైంద‌న్న కార‌ణం గానే తాను సంతృప్తి చెంద‌డం లేద‌ని, భార‌త‌దేశాని కి మ‌రియు బాంగ్లాదేశ్ కు మ‌ధ్య గ‌ల సంబంధాలు ఈ రోజు న చ‌రిత్రాత్మ‌క‌మైనటువంటి ఉన్న‌త స్థాయి లో కొన‌సాగడం తో పాటు ఉభ‌య దేశాలు క‌ల‌సిక‌ట్టుగా పేద‌రికం తో పోరాడుతుండటం కూడా త‌న‌ కు సంతృప్తి ని ఇస్తోంద‌ని ఆయ‌న వివ‌రించారు. 

క‌ర్తార్‌ పుర్ కారిడోర్‌

విభ‌జ‌న మ‌న వ‌ద్ద నుండి గురుద్వారా క‌ర్తార్‌ పుర్ సాహిబ్ ను తీసివేసుకొని దాని ని పాకిస్తాన్ లో ఒక భాగం గా చేసింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  క‌ర్తార్‌పుర్ గురు నాన‌క్ యొక్క స్థ‌లం.  ఆ ప‌విత్ర స్థ‌లం తో కోట్లాది దేశ‌వాసుల విశ్వాసం ముడివ‌డి ఉంది అని ఆయ‌న అన్నారు.  ద‌శాబ్దాల పాటు సిఖ్ఖు భ‌క్తులు క‌ర్తార్‌ పుర్ కు సులువుగా చేరుకొనే అవ‌కాశం కోసం, గురు భూమి ని ఒక్క‌సారి ద‌ర్శించుకోవడం కోసం వేచి ఉన్నారు అని ఆయ‌న అన్నారు.  ఇది ఈ ప్ర‌భుత్వం క‌ర్తార్‌ పుర్ కారిడోర్ ను నిర్మించ‌డం ద్వారా సాధ్యమైంది అని ఆయన చెప్పారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond