వైమానిక దళ ప్రధానాధికారి న్యూ ఢిల్లీ లోని ఎయర్ హౌస్ లో ఈ రోజు న నిర్వహించిన ‘ఎట్ హోమ్’కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.
కార్యక్రమ స్థలం వద్ద ఏర్పాటైన ‘ఐఎఎఫ్ ఇనవేశన్ డిస్‌ప్లే’ను ప్రధాన మంత్రి సందర్శించారు. ‘దేశవాళీ పద్ధతుల లో నూతన ఆవిష్కరణ ల ద్వారా ఆత్మనిర్భరత సాధన’ అనేది ఈ ప్రదర్శన ఇతివృత్తం గా ఉంది.
భారతీయ వైమానిక దళం మార్శల్ శ్రీ అర్జన్ సింహ్ యొక్క స్మారక స్టాంపు ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు.