రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ నేడు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో 2015వ, 2016వ, 2017వ, 2018వ సంవత్సరాల కు గాను ‘గాంధీ శాంతి బహుమతి’ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రతిష్టాకరమైన గాంధీ శాంతి బహుమతి ని అందుకొన్న వారికి అభినందనలు తెలిపారు. మహాత్మ గాంధీ 150వ జయంతి ని భారతదేశం జరుపుకొంటున్న కాలం లో ఈ బహుమతి ని అందించడమైందని ఆయన అన్నారు. ఈ సందర్భం గా బాపూ జీ కి చాలా ప్రియమైనటువంటి భజన గీతం ‘వైష్ణవ్ జన్ తో..’ను ప్రపంచ వ్యాప్తం గా దాదాపు 150 దేశాల కళాకారులు ఆలాపించడం పట్ల ప్రధాన మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది గాంధీ యొక్క ఆదర్శాలు నేటికీ ఆమోదయోగ్యమైనని ప్రపంచం భావిస్తోందనడానికి ఒక సంకేతంగా నిలచిందని ఆయన పేర్కొన్నారు.
స్వచ్ఛత పట్ల మహాత్మ గాంధీ యొక్క సంకల్పాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు.
స్వాతంత్య్ర పోరాటం ఒక ప్రజా ఉద్యమం గా మారిందంటే అందుకు మహాత్మ గాంధీ దార్శనిక భరిత కృషే కారణం అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజా భాగస్వామ్యం మరియు జనాందోళన అనే రెండు ప్రవాహాల ను మహాత్మ గాంధీ విలీనపరచారు అని శ్రీ మోదీ చెప్పారు.
దేశం లోని ప్రతి ఒక్కరిలో భారత స్వాతంత్య్ర సంగ్రామాని కి వారి వంతు తోడ్పాటు ను అందించాలన్న స్ఫూర్తి ని మహాత్మ గాంధీ పాదుగొల్పారని ప్రధాన మంత్రి అన్నారు.
Congratulations to all those who have been conferred the prestigious Gandhi Peace Prize.
— PMO India (@PMOIndia) February 26, 2019
The prize is being conferred at a time when India marks the 150th birth anniversary of Mahatma Gandhi: PM @narendramodi
The freedom struggle became a mass movement due to the visionary efforts of Bapu. He merged the streams of Jan Bhagidari and Jan Andolan.
— PMO India (@PMOIndia) February 26, 2019
Bapu instilled a spirit in every person that they are doing something for India's freedom: PM @narendramodi