ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం బెర్లిన్ కు విచ్చేశారు. బెర్లిన్ లో జరిగే ‘భారతదేశం- జర్మనీ అంతర్ ప్రభుత్వ నాలుగో సంప్రతింపుల’ కార్యక్రమంలో ఆయన పాలుపంచుకొంటారు. జర్మనీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక పర్యటన జరపడం ఇప్పటికి ఇది రెండో సారి.
బెర్లిన్ వెలుపల శ్లాస్ మేజ్ బర్గ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి చాన్స్ లర్ ఏంజెలా మర్కెల్ లాంఛనప్రాయ విందు ఇచ్చారు. వారు ఉభయులు సుమారు మూడు గంటల సేపు సంభాషించారు. ఈ సందర్భంగా నైపుణ్యాల అభివృద్ధి, శుద్ధ శక్తి, స్మార్ట్ సిటీస్ వంటి పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. జిఎస్ టి సహా భారతదేశం అమలుపరుస్తున్న ఆర్థిక సంస్కరణల అజెండా పట్ల అభినందన వ్యక్తమైంది.
నేతలు ప్రాంతీయ మరియు ప్రపంచ అంశాలపై సమీక్ష జరిపారు. యూరోపియన్ యూనియన్ ను కలిపి ఉంచే బలం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి, ప్రపంచంలో స్థిరత్వ శక్తిగా దానికి ఉన్న విశిష్టతను గురించి ప్రధాన మంత్రి శ్రీ మోదీ నొక్కిచెప్పారు.
అఫ్గానిస్తాన్ విషయంలో- అఫ్గానిస్తాన్ కు మాత్రమే ప్రమేయం ఉండే, అఫ్గాన్ నాయకత్వంలో సాగే ఒక సర్దుబాటు ప్రక్రియ చోటు చేసుకోవడం ముఖ్యమని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.
సమూల సంస్కరణ వాదానికి తావు ఇవ్వకపోవడం, ఉగ్రవాదం వంటి అంశాలు సైతం చర్చలలో భాగమయ్యాయి. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్డు కార్యక్రమం మరియు శీతోష్ణ స్థితిలో మార్పు కూడా చర్చలలో చోటు చేసుకొన్నాయి.
అంతక్రితం, శ్లాస్ మేజ్ బర్గ్ కు చేరుకున్న ప్రధాన మంత్రి అక్కడ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఇరువురు నేతలు ఆ నివాస భవనం పచ్చిక బయలులో కాసేపు నడుస్తూ ముచ్చటించారు.
In Deutschland angekommen. pic.twitter.com/kcudTH3IGj
— Narendra Modi (@narendramodi) May 29, 2017
Ich bin sicher, dieser Besuch wird zu vorteilhaften Ergebnissen führen und die deutsch-indische Freundschaft vertiefen. pic.twitter.com/jgbL3UOjVe
— Narendra Modi (@narendramodi) May 29, 2017
Reached Germany. I am sure this visit will lead to beneficial outcomes & deepen India-Germany friendship. pic.twitter.com/RdYLWUYeMn
— Narendra Modi (@narendramodi) May 29, 2017
Had a very good interaction with Chancellor Merkel. pic.twitter.com/5SQb5l205M
— Narendra Modi (@narendramodi) May 29, 2017