శ్రీమతి డారిస్ ఫ్రాన్సిస్ చికిత్స కోసం పి ఎమ్ ఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు ఆమోదం తెలిపారు. శ్రీమతి డారిస్ ఫ్రాన్సిస్ అందిస్తున్న సేవలు, కేన్సర్ కారణంగా ఆమె జబ్బుపడడం గురించి వచ్చిన వార్తలను పి ఎమ్ ఒ పరిశీలించింది. శ్రీమతి డారిస్ ఫ్రాన్సిస్ న్యూ ఢిల్లీ లోని ఎ ఐ ఐ ఎమ్ ఎస్ లో చికిత్స పొందుతున్నారు. రోగి పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవలసిందిగా ఆసుపత్రి అధికార యంత్రాంగాన్ని అభ్యర్థించడమైంది. శ్రీమతి డారిస్ ఫ్రాన్సిస్ కు మంజూరైన ఆర్థిక సహాయాన్ని గురించి ఆసుపత్రికి, ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జాతీయ రహదారి మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించడం కోసం స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ గాజియాబాద్ నివాసి శ్రీమతి డారిస్ ఫ్రాన్సిస్ ప్రసిద్ధికెక్కారు.