జాతీయ సమగ్రత కు ఉద్దేశించినటువంటి సర్దార్ పటేల్ వార్షిక పురస్కారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేవడియా లో నిన్న డిజిపి లు/ఐజిపి ల సమావేశం జరిగిన సందర్భం గా ప్రకటించారు. ఈ పురస్కారాన్ని జాతీయ సమగ్రత ను పెంపొందించడం కోసం చేసే అసాధారణమైన కృషికి గాను ఇస్తున్నారు.
“సర్దార్ పటేల్ గారు ఆయన జీవితాన్ని భారతదేశాన్ని ఏకం చేసే దిశ గా అంకితం చేశారు. జాతీయ సమగ్రత కై ఇచ్చే సర్దార్ పటేల్ పురస్కారం ఆయన కు ఒక సముచితమైన నివాళి అవుతుంది; అంతేకాక ఇది భారతదేశ ఏకత ను, జాతీయ సమగ్రత ను వర్ధిల్లజేసే దిశ గా కృషి చేసేందుకు మరింత మంది ప్రజల కు ప్రేరణ ను కూడా అందిస్తుంది” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Sardar Patel devoted his life towards unifying India. The Sardar Patel Award for National Integration will be a fitting tribute to him and will inspire more people to work towards furthering India’s unity and national integration.
— Narendra Modi (@narendramodi) December 23, 2018