మణిపుర్ లోని నోనీ జిల్లా లో జరిగిన ఘోర బస్సు ప్రమాద దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం లో మరణించిన వారి బంధువుల కు 2 లక్షల రూపాయల వంతున, గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -
‘‘మణిపూర్ లోని నోనీ జిల్లా లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు తీవ్ర వేదనకు లోనయ్యాను. ఈ దురదృష్టకర ఘటన లో తమ ఆప్తుల ను కోల్పోయిన వారికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితుల కు సాధ్యమైన అన్ని విధాలుగాను సాయపడటానికి మణిపూర్ పాలనాయంత్రాంగం చొరవ తీసుకుంటోంది: ప్రధాన మంత్రి @narendramodi’’
‘‘బస్సు ప్రమాద దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారం ఇవ్వడం జరుగుతుంది. దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి@narendramodi’’ అని పేర్కొంది.
Anguished by the loss of lives in Manipur's Noney district due to a tragic bus accident. My thoughts are with the bereaved families. I hope the injured recover soon. The Manipur government is providing all possible assistance to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 21, 2022