జార్ఖండ్ లోని పాకూర్ లో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు రెండు లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున, పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి పరిహారం అందించనున్నట్లు, ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా వరుస ట్వీట్లు చేసింది.
“జార్ఖండ్ లోని పాకూర్ లో జరిగిన బస్సు ప్రమాదం పట్ల నేను ఆందోళన చెందాను. ఈ విషాద సమయంలో, మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: PM@narendramodi”.
"పాకూర్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు రెండు లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున, పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి పరిహారం అందించడం జరుగుతుంది."
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives in an accident in Pakur. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 5, 2022