ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’ సందర్భం గా కేవడియా లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ఏక్ తా దివస్ తాలూకు ప్రతిజ్ఞ ను చేయించారు. దేశం నలు మూల ల నుండి తరలి వచ్చిన వివిధ పోలీసు దళాలు ప్రదర్శించిన కవాతు ను కూడా ఆయన సమీక్షించారు.
అక్టోబరు 31వ తేదీ ని ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’గా 2014వ సంవత్సరం నుండి పాటించడం జరుగుతోంది. ఈ సందర్భం గా దేశవ్యాప్తం గా నిర్వహించే ‘రన్ ఫర్ యూనిటీ’ లో అన్ని వర్గాల ప్రజలు పాలు పంచుకొంటున్నారు.
అన్ని రాష్ట్రాల కు చెందిన పతాక ధారులు మరియు గుజరాత్ స్ట్యూడెంట్ కేడెట్ కోర్ కలసి ప్రధాన మంత్రి సమక్షం లో ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అభ్యాసాన్ని ప్రదర్శించాయి. ఎన్ఎస్ జి, సిఐఎస్ఎఫ్, ఎన్ డిఆర్ఎఫ్, సిఆర్ పిఎఫ్, గుజరాత్ పోలీస్, ఇంకా జమ్ము- కశ్మీర్ పోలీస్ బలగాలు సహా వేరు వేరు పోలీసు బలగాలు ప్రధాన మంత్రి ఎదుట వాటి ప్రదర్శన లను విడి విడి గా ఆవిష్కరించాయి.
ఆ తరువాత, కేవడియా లో టెక్నాలజీ డెమన్స్ ట్రేశన్ సైట్ ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. పోలీసు బలగాల ఆధునికీకరణ, విమానయాన భద్రత తదితర అనేక ఇతివృత్తాల పై నూతన సాంకేతికతల ను కళ్ళ కు కడుతూ పోలీసు బలగాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు.