ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టేకన్‌పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీ లో డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సమావేశం 2014వ సంవత్సరం నుండి ఢిల్లీ వెలుపలకు మారిన తరువాత ఈ సమావేశ స్వభావం మరియు సమావేశ పరిధి ఏ విధంగా మారాయో ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ఈ పరివర్తనకు రంగం సిద్ధం చేయడంలో తోడ్పాటును అందించినటువంటి అధికారులను ఆయన ప్రశంసించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు మరియు దేశం ముందున్న బాధ్యతల విషయంలో ఈ సమావేశం ప్రస్తుతం మరింత ఉపయుక్తంగా మారినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. చర్చల వాసిలో చెప్పుకోదగ్గ మెరుగుదలకు సమావేశం యొక్క నూతన స్వరూపం దారి తీసినట్లు ఆయన వివరించారు.
దేశాన్ని భద్రంగా ఉంచడంలో భద్రత యంత్రాంగం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ రోజు ఇక్కడ హాజరైన అధికారులు తరచుగా నకారాత్మక వాతావరణంలో విధులను నిర్వహించవలసి వస్తున్నప్పటికీ నాయకత్వ లక్షణాలను కనబరచారని ఆయన పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమావేశంలో జరిగిన చర్చల ఫలితంగా- పోలీసు బలగాలకు ఒక లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించారంటే గనుక దాని అమలులో బోలెడంత పొందిక చోటు చేసుకొంటోందని ఆయన తెలిపారు. సమస్యల, సవాళ్ళ తాలూకు సంపూర్ణ దృష్టి కోణాన్ని పోలీసు ఉన్నతాధికారులు అలవరచుకోవడంలో ఈ సమావేశం వారికి తోడ్పడుతోందని ఆయన అన్నారు. ఇక్కడ చర్చిస్తున్న అంశాల శ్రేణి గత రెండు సంవత్సరాలుగా మరింత విస్తృతమైనట్లు, ఇది పోలీసు సీనియర్ అధికారులకు ఒక సమగ్రమైన నూతన దార్శనికతను అందించడంలో సహకరించినట్లు ఆయన చెప్పారు.
ఈ సమావేశానికి మరింత విలువను జోడించేందుకు అనుసరించవలసిన మార్గాలను గురించి ప్రధాన మంత్రి చర్చిస్తూ, సంవత్సరం పొడవునా కొన్ని కార్యాచరణ బృందాల ద్వారా అనుశీలన కొనసాగాలని సూచించారు. ఈ సందర్భంగా యువ అధికారుల ప్రమేయానికి ప్రాముఖ్యం ఇవ్వాలని ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఇది ఈ కసరత్తు యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో తోడ్పడగలుగుతుందని ఆయన అన్నారు.
చట్టబద్ధం కాని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని మరింతగా పంచుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఏకాభిప్రాయాన్ని గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిని సాధించడంలో భారతదేశం ఒక కీలక పాత్రను పోషించవలసి ఉందని ఆయన చెప్పారు. నిజాయతీకి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పెరుగుతున్న కొద్దీ, రాష్ట్రాల మధ్య భద్రత అంశాలపై మరింత ఎక్కువ దాపరికం లేని వాతావరణం సైతం విస్తరించాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఆయన వివరించారు. భద్రతను ఎంపికల ప్రకారమో లేదా ఒంటరిగానో సాధించజాలమని ఆయన చెప్పారు. అయితే, అడ్డుగోడలను ఛేదించడం మరియు సమాచారాన్ని రాష్ట్రాల మధ్య పంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు మరింత భద్రంగా ఉండేందుకు సహకరించ గలవని ఆయన అన్నారు. ‘‘మనం ఒక చోటుకు చేర్చిన అస్తిత్వం కాదు మనం ఓ జీవ పదార్థం’’ అంటూ ఆయన స్పష్టీకరించారు.
సైబర్ సెక్యూరిటీ అంశాలను తక్షణమే పరిష్కరించాలని, అత్యధిక ప్రాధమ్యంతో ప్రధాన మంత్రి అన్నారు. ఈ విషయంలో మరీ ముఖ్యంగా సామాజిక ప్రసార మాధ్యమాల ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. సందేశాలు పంపుకోవడం అనేది మరింత ప్రభావవంతంగా ఉండేందుకు గాను స్థానిక భాషలలో సాగాలని ఆయన అన్నారు. సమూల సంస్కరణ వాదం అంశం పై ఆయన మాట్లాడుతూ, సమస్యాత్మక ప్రాంతాలు ఏవేవి అన్నది
సుస్పష్టంగా గుర్తించడానికి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విశిష్ట సేవకు గాను ఇచ్చే రాష్ట్రపతి పోలీసు పతకాలను ఐబి అధికారులకు ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. పతకాలను గెలుచుకొన్న ఐబి అధికారులు కనబరచిన అంకిత భావానికి మరియు సేవ పూర్వక నిబద్ధతలకు గాను వారిని ప్రధాన మంత్రి ప్రశంసించి, తన ప్రసంగంలో వారికి అభినందనలు తెలియజేశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ మరియు హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ హన్స్ రాజ్ అహీర్, శ్రీ కిరణ్ రిజిజూ లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.