It is our Constitution that binds us all together: PM Modi
What is special about Indian Constitution is that it highlights both rights and duties of citizens: PM Modi
As proud citizens of India, let us think how our actions can make our nation even stronger: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌న రాజ్యాంగాని కి ఉన్నటువంటి కలుపుకుపోయేటటువంటి శ‌క్తి ని గురించి ఈ రోజు న ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు. ఇది దేశ ప్ర‌జ‌ల అఖండ‌త ను ప‌రిర‌క్షిస్తూ మనం స‌వాళ్ళ కు ఎదురొడ్డి నిల‌చేట‌ట్టు మ‌నల ను తీర్చిదిద్దిందని కూడా ఆయ‌న అన్నారు.

రాజ్యాంగం ఆచరణ లోకి వచ్చి ప్రస్తుతాని కి 70వ సంవ‌త్స‌రం వ‌చ్చినందుకు గుర్తు గా పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాలు లో ఈ రోజు న ఉభ‌య స‌భల సంయుక్త స‌మావేశం ఏర్పాటు కాగా ఆ సమావేశాన్ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు.

రాజ్యాంగ దినాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ‘‘గ‌తం తో మ‌న సంబంధాన్ని ప‌టిష్ట ప‌ర‌చే కొన్ని సంద‌ర్భాలంటూ మరియు కొన్ని రోజులంటూ ఉన్నాయి. అవి ఒక మెరుగైన భ‌విష్య‌త్తు దిశ గా కృషి చేసేందుకు మ‌న‌ కు ప్రేరణనిస్తాయి. ఈ రోజు న‌వంబ‌ర్ 26వ తేదీ ఓ చ‌రిత్రాత్మ‌క‌ దినం. 70 సంవ‌త్స‌రాల క్రితం మ‌నం మ‌న యొక్క ఘ‌న‌మైన రాజ్యాంగాన్ని శిరసావహించాము’’ అన్నారు.

రాజ్యాంగ ప‌రిష‌త్తు అనేక చ‌ర్చ‌లు మ‌రియు పర్యాలోచనల ను జ‌రిపిన మీదట వాటి తాలూకు ఒక ఫ‌లం గా రాజ్యాంగం ల‌భించింది అని ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణించారు. దేశాని కి రాజ్యాంగాన్ని ఇచ్చేందుకై పాటుపడ్డ వారందరి ని ఆయ‌న ప్రశంసించారు.

“7 దశాబ్దాల క్రింద‌ట ఇదే సెంట్ర‌ల్ హాల్ లో మ‌న స్వ‌ప్నాల‌ ను గురించి, మన ముందున్న సవాళ్ల ను గురించి, మన ముందు నిల‌చినటువంటి అవ‌కాశాలు గురించి మరియు రాజ్యాంగం తాలూకు ప్ర‌తి ఒక్క క్లాజు ను గురించి చ‌ర్చించ‌డమైంది. డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్, డాక్ట‌ర్ భీం రావ్ ఆంబేడ్ కర్‌, స‌ర్ దార్ వ‌ల్ల‌భ్ భాయి ప‌టేల్‌, పండిత్ నెహ్రూ, ఆచార్య కృప‌లానీ, మౌలానా అబుల్ క‌లామ్ ఆజాద్, మ‌రెంద‌రో సీనియ‌ర్ నాయ‌కులు చర్చల ను, వాద వివాదాల ను జరిపి తదనంతరం ఈ యొక్క వార‌స‌త్వాన్ని మ‌న‌కు అందించారు. ఈ రాజ్యాంగాన్ని మ‌న‌కు ప్రదానం చేయడం లో పాలు పంచుకొన్న వారంద‌రి కి నా న‌మ‌స్సు లు.’’

‘‘రాజ్యాంగ ప‌రిష‌త్తు స‌భ్యులు క‌న్న క‌ల‌లు మ‌న రాజ్యాంగం లో ఉల్లేఖించినటువంటి విలువ‌లు గాను, పదాలు గాను రూపు దాల్చాయి’’ అని ఆయ‌న అన్నారు.

బాబాసాహెబ్ భీం రావ్‌ ఆంబేడ్ కర్‌ జీ 1949వ సంవ‌త్స‌రం, న‌వంబ‌ర్ 25వ తేదీ నాడు రాజ్యాంగాన్ని గురించి తాను చేసిన చివరి కడపటి సంబోధన లో భాగం గా ప్ర‌జ‌ల కు ‘‘గతం లో మ‌నం మ‌న స్వీయ త‌ప్పిదాల కార‌ణం గా మన స్వాతంత్య్రాన్ని మరియు దేశం యొక్క గ‌ణ‌తంత్ర స్వ‌భావాన్ని.. ఈ రెంటి ని కోల్పోయాము’’ అని గుర్తు చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘దేశ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం దేశం యొక్క స్వాతంత్య్రాన్ని మరియు దేశ ప్ర‌జాస్వామ్యాన్ని స్థిరపరచ గ‌లరా? అంటూ వారి ని ఆంబేడ్ కర్ గారు హెచ్చ‌రించారు’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

‘‘బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ గారు ప్ర‌స్తుతం స‌జీవంగా ఉండివుంటే, ఆయ‌న బ‌హుశ: అత్యంత సంతోష‌ంతో ఉండే వారు. భార‌త‌దేశం ఒక్క త‌న సుగుణాల నే నిలుపుకోవ‌డం కాకుండా దాని యొక్క స్వాతంత్య్రాన్ని మ‌రియు ప్ర‌జాస్వామ్యాన్ని కూడా బ‌లోపేతం చేసుకొంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘మ‌రి ఈ కార‌ణం గానే నేను రాజ్యాంగం లోని చ‌ట్ట స‌భ,  కార్య‌నిర్వ‌హ‌ణ మ‌రియు న్యాయ పాల‌న అంగాల కు ప్ర‌ణ‌మిల్లుతున్నాను. ఈ అంగాలు రాజ్యాంగం లో ప్రతిష్ఠించబ‌డ్డ విలువ‌ల ను మ‌రియు ఆద‌ర్శాల ను నిలబెట్టడం లో తోడ్ప‌డ్డాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

రాజ్యాంగాన్ని స‌మున్న‌తం గా నిలిపేందుకు పరిశ్రమిస్తున్నటువంటి యావ‌త్తు దేశాని కి కూడా తాను తల వంచి న‌మ‌స్క‌రిస్తున్నట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

‘‘భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల విశ్వాసాన్ని ఉంచిన 130 కోట్ల మంది భార‌తీయుల కు నేను విన‌మ్రం గా శిరస్సు ను వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. వారి కి భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం ఏనాటి కి స‌న్న‌గిలేటటువంటిది కాదు. వారు రాజ్యాంగాన్ని ఒక ప‌విత్ర‌ గ్రంథం గాను,  దారి ని చూపే దీపం గాను సదా ఆరాధిస్తూ వ‌చ్చారు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘మ‌న రాజ్యాంగాని కి 70 సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌డం మ‌న‌కు సంతోషాన్ని, ఆధిప‌త్యాన్ని మ‌రియు ఒక నిశ్చితి భావ‌న ను ప్ర‌సాదిస్తున్నాయి.  సంతోషాని కి కారణం రాజ్యాంగం యొక్క స‌త్ ల‌క్ష‌ణాల కు మ‌రియు సారాని కి చెందిన‌ వారం అనే ఒక నిశ్చ‌య భావ‌న యే. దీని కి భిన్న‌మైన‌టువంటి ఏ ప్ర‌య‌త్నాన్నయినా సరే, ఈ దేశ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు.  ఆధిప‌త్యానికి కారణం మ‌నం రాజ్యాంగం లో పొందుపరచినటువంటి ఆద‌ర్శాల వల్లనే మనం ఈ రోజు న ఏక్ భార‌త్, శ్రేష్ఠ్ భార‌త్ దిశ గా సాగ‌ గ‌లుగుతున్నాము.   విశాల‌మైనటువంటి  మ‌రియు బ‌హుళత్వం తో కూడిన‌టువంటి దేశం త‌న ఆకాంక్ష‌ల ను, స్వ‌ప్నాల ను మ‌రియు ప్ర‌గ‌తి ని సాధించ గ‌లిగే ఏకైక సాధ‌నం రాజ్యాంగ‌మే అన్నదే ఇందులో మనం దర్శించ గలిగే సారాంశం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మ‌నకు రాజ్యాంగం ప‌విత్ర గ్రంథం అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభివ‌ర్ణించారు.

‘‘మ‌న రాజ్యాంగం మ‌న‌ కు అత్యంత ప‌విత్ర‌మైనటువంటి పుస్త‌కం. ఇది మ‌న జీవితాని కి, మ‌న స‌మాజాని కి, మ‌న సంప్ర‌దాయాలకు, మ‌న విలువల కు మ‌రియు మ‌న స‌కల స‌వాళ్ళ కు కూడా ఏకైక సమ్మిళిత ప‌రిష్కారం’’ అని ఆయ‌న పేర్కొన్నారు.

రాజ్యాంగం రెండు త‌త్వాల పైన ఆధార‌ప‌డింద‌ని, వాటి లో ఒకటో ది ఏక‌త మ‌రియు రెండోది గౌర‌వం అని ఆయ‌న వివ‌రించారు. రాజ్యాంగం యొక్క రెండు మంత్రాల లో ఒకటేమో ‘భార‌తీయుల యొక్క గౌర‌వం’, రెండోదేమో ‘భార‌త‌దేశం కోసం ఏకం గా నిల‌వ‌డం’. ఇది భార‌త‌దేశం యొక్క ఏక‌త ను ప‌దిలం గా ఉంచ‌డం తో పాటు మ‌న పౌరుల గౌరవాన్ని స‌ర్వోప‌రి గా ఉంచిందని ఆయన అన్నారు.

‘‘గ్లోబ‌ల్ డిమాక్ర‌సి కి ఒక స‌ర్వోత్త‌మ అభివ్య‌క్తీక‌ర‌ణ గా రాజ్యాంగం రూపు దాల్చింది. మ‌రి ఇది మనలను మ‌న హ‌క్కుల విష‌యం లో మాత్ర‌మే కాక మ‌న బాధ్య‌త విష‌యం లో కూడా తెలుసుకొనేటట్టు చేసింది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘భార‌త‌దేశ రాజ్యాంగం పౌరుల హ‌క్కులు మ‌రియు పౌరుల విధులు.. రెంటి ని గురించి ప్ర‌ముఖం గా చాటిచెప్తున్న‌ది. ఇదే మ‌న రాజ్యాంగం లోని ఒక ప్ర‌త్యేక‌మైన అంశం గా ఉన్నది. హ‌క్కుల కు మ‌రియు బాధ్య‌త‌ల కు మ‌ధ్య తుల్య‌త మ‌రియు సంబంధం.. వీటి ని మ‌న జాతి పిత మహాత్మ గాంధీ జీ ఎంతో బాగా అర్థం చేసుకొన్నారు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

రాజ్యాంగం లో ప్రతిష్ఠించబడ్డ క‌ర్త‌వ్య భావ‌న కు క‌ట్టుబ‌డి ఉండే స్ఫూర్తి ని అల‌వ‌ర‌చుకోవ‌ల‌సింది గా ప్ర‌జ‌ల కు ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

‘‘మ‌న రాజ్యాంగం లో నిర్దేశించిన విధుల ను ఏ విధం గా మ‌నం నెర‌వేర్చ‌గ‌లుగుతాము అన్న విష‌యాన్ని గురించి మ‌నం ఆలోచిద్దాము.

సేవ‌ కు మ‌రియు బాధ్య‌త కు న‌డుమ ఉన్నటువంటి వ్య‌త్యాసాన్ని మ‌న‌ం గుర్తెర‌గాలి. సేవ అనేది స్వ‌చ్ఛంద‌మైన‌టువంటిది. అంటే మీరు వీధి లోని ఒక ఆర్తుని కి స‌హాయపడవ‌చ్చును; కానీ, మీరు వాహ‌నాన్ని న‌డిపేట‌ప్పుడు మాత్రం ట్రాఫిక్ నియ‌మాల ను తు.చ. త‌ప్ప‌క అనుస‌రిస్తే మీ యొక్క బాధ్య‌త ను నెర‌వేర్చినట్లు.

మ‌నం ప్ర‌జ‌ల తో మెల‌గేట‌ప్పుడు మ‌న బాధ్య‌తల ప‌ట్ల శ్రద్ధ వహించే  ప్ర‌య‌త్నాన్ని చేయాలి.

మ‌న‌ం భార‌త‌దేశం యొక్క స‌గ‌ర్వ పౌరుల‌ వలె, మ‌న చ‌ర్య‌ లు ఏ విధం గా మ‌న దేశాన్ని దృఢ‌ త‌ర పరచగ‌లుగుతాయో అనేది ఆలోచిద్దాము’’ అని ఆయ‌న అన్నారు.

‘‘మ‌న రాజ్యాంగం ‘‘భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌మైన మనము’’ అనే ప‌దాల‌ తో ఆరంభం అవుతుంది. ఈ దేశం యొక్క శక్తి, ఈ దేశం యొక్క స్ఫూర్తి మ‌రియు ఈ దేశం యొక్క ప్ర‌యోజ‌నం ఈ దేశ ప్ర‌జ‌ల‌మైన మ‌న‌మే అనేటటువంటి విష‌యాన్ని మ‌నం గ్రహింపునకు తెచ్చుకొందాము’’ అని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ రోజు ను ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొంటూ, ఇది ఎటువంటి రోజు అంటే 2008వ సంవ‌త్స‌రం లో ముంబ‌యి లో న ఒక ఉగ్ర‌వాద దాడి లో ఎంతో మంది చ‌నిపోయింది ఈ రోజు నే అన్నారు. ఆ భ‌యంక‌ర‌మైన రోజు న క‌నుమూసిన వారి కి ప్ర‌ధాన మంత్రి నివాళుల ను అర్పించారు.

‘‘అయితే, ఈ రోజు వేల సంవ‌త్స‌రాల నాటి సుసంప‌న్న త‌త్వమైన ‘వ‌సుధైవ కుటుంబ‌క‌మ్’ (ఈ ప్రపంచం అంతా కూడాను ఒకే కుటుంబం అనేటటువంటి) భావ‌న ను ధ్వంసం చేయ‌డాని కి ముంబయి లో ఉగ్రవాదులు యత్నించినటువంటి రోజు కూడా అన్నది వేద‌న ను కూడా క‌లిగిస్తున్నది’’ అని ఆయ‌న అన్నారు. ‘‘మ‌న‌ల‌ ను వీడి వెళ్ళిన వారి ఆత్మ‌ల కు నేను చ‌ర‌మ వంద‌నాన్ని ఆచ‌రిస్తున్నాను’’ అని ఆయ‌న పేర్కొన్నారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi