ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు 2017 బ్యాచ్ కు చెందిన 160 మంది యువ ఐఎఎస్ అధికారుల తో సమావేశమయ్యారు. వీరంతా ఇటీవలే భారత ప్రభుత్వం లో సహాయ కార్యదర్శులు గా నియమితులయ్యారు.
ముస్సోరి లో శిక్షణ సమయం లో ఈ బృందం తో తన సమావేశం గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం గా గుర్తు చేసుకున్నారు.
అధికారులు, తమ క్షేత్ర స్థాయి శిక్షణ సమయం లోని అనుభవాలను ప్రధాని తో పంచుకున్నారు. ఈ అనుభవాల ను వారు తమకు ముస్సోరి లో తరగతి గది లో లభించిన శిక్షణ అనుభవాలను ఈ క్షేత్ర స్థాయి అనుభవాల తో కలిపి వివరించడానికి ప్రయత్నించారు. ఆకాంక్షభరిత జిల్లాల లో పని చేసిన అధికారులు, ఈ జిల్లాల లో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ఎలా పని చేస్తున్నాయో వివరించే ప్రయత్నం చేశారు.
భారత ప్రభుత్వం లో సహాయ కార్యదర్శులు గా ఈ అధికారులకు రానున్న మూడు నెలలు ఎంతో కీలకమైనవని, ఇది ఎంతో ఆలోచన తో చేసిన ఏర్పాటు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్క అధికారికి ఈ సమయం లో విధాన రూపకల్పన ను ప్రభావితం చేసే అవకాశం లభిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
కొత్త దార్శనికత, కొత్త ఆలోచనలు, సరికొత్త విధానాల తో సమస్యల కు పరిష్కారం కనుగొనాల్సిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువ అధికారులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశ్యం ప్రభుత్వ పని తీరులో నూతనత్వాన్ని, తాజాదనాన్ని తీసుకురావడమేనని ఆయన అన్నారు. అనుభవాల సమ్మేళనం, తాజాదనం ఇవి వ్యవస్థ కు ఎంతో ఉపయోగపడనున్నాయని ప్రధాన మంత్రి చెప్పారు.
అధికారులు, తమకు అప్పగించిన లక్ష్యాలను చేరుకునే క్రమంలో తాజా దృష్టి కోణం, ‘‘పౌర కేంద్రిత దృక్పథం’’ తో పని చేయాలని ప్రధాన మంత్రి సూచించారు.
క్షేత్ర స్థాయిలో ఇటీవల తాము గడించిన అనుభవాన్ని, ఢిల్లీ లో తాము చేసే పనితో అనుసంధానం చేసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. ప్రధాన మంత్రి కార్యాలయం లో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింహ్, డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ లోని సీనియర్ అధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.
దేశంలో సివిల్ సర్వీసుల కు నిర్మాత గా భావించే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవితం, వారు సాధించిన విజయాలను సూచించే ఒక దృశ్య, శ్రవణ చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు.