PM Modi receives 'Global Goalkeeper Award' for the Swachh Bharat Abhiyan
In last five years a record more than 11 crore toilets were constructed: PM Modi
Swachh Bharat mission has benefited the poor and the women most: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ కు గాను బిల్ ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేశ‌న్ ప్రదానం చేసిన గ్లోబ‌ల్ గోల్ కీప‌ర్‌ అవార్డు ను 2019వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 24వ తేదీ నాడు అందుకొన్నారు. ఈ పుర‌స్కార ప్రదానోత్సవం న్యూ యార్క్ లో ఐక్య రాజ్య స‌మితి సాధార‌ణ స‌భ‌ (యుఎన్‌జిఎ) స‌మావేశాల సంద‌ర్భం గా జ‌రిగింది.

స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ ను ఒక ప్రజాందోళ‌న గా మార్చిన‌టువంటి మ‌రియు దీని ని వారి దైనందిన జీవ‌నం లో ఒక భాగం గా మ‌ల‌చుకొన్న‌టువంటి భార‌తీయుల కు ఈ అవార్డు ను ప్ర‌ధాన మంత్రి అంకితమిచ్చారు.

“స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ భార‌త‌దేశ ప్ర‌జ‌ల వల్లే స‌ఫ‌లమైంది. వారు దీని ని వారి యొక్క స్వీయ ఉద్య‌మం గా మలచుకోవడం తో, దీని నుండి ఆశించిన‌ ఫ‌లితాల ను సాధించ‌గలిగారు” అని ప్ర‌ధాన మంత్రి అవార్డు ను స్వీక‌రించిన అనంత‌రం వ్యాఖ్యానించారు.

మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి సంద‌ర్భం గా ఈ అవార్డు ను అందుకోవడం త‌న‌ కు ఒక ముఖ్య‌మైన ఘ‌డియ అని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, 130 కోట్ల మంది భార‌తీయులు ఒక ప్ర‌తిజ్ఞ ను చేసిన‌ప్పుడు ఎటువంటి స‌వాలు ను అయినా అధిగ‌మించ‌వ‌చ్చు అన‌డానికి స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ ఒక నిద‌ర్శ‌నం అని పేర్కొన్నారు. మ‌హాత్మ గాంధీ కన్న స్వ‌చ్ఛ్ భార‌త్ క‌ల ను నెరవేర్చడం లో భార‌త‌దేశం ప్రశంసాయోగ్యమైనటువంటి పురోగ‌తి ని సాధించింద‌ని కూడా ఆయ‌న అన్నారు.

‘‘గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో రికార్డు సంఖ్య లో 11 కోట్ల‌ కు పైగా టాయిలెట్ లను నిర్మించ‌డ‌ం జరిగింది. ఈ ఉద్య‌మం తో దేశం లో పేద‌ల కు, మ‌హిళ‌ల కు ఎక్కువ ప్రయోజనం కలిగింది’’ అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. పారిశుధ్యం, ఇంకా ఆరోగ్య ప్ర‌యోజ‌నాల కు తోడు, 11 కోట్ల టాయిలెట్ ల నిర్మాణం ప‌ల్లెల లో ఆర్థిక కార్య‌క‌లాపాల కు కూడా ఊతాన్ని ఇచ్చిందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్ర‌పంచ వ్యాప్తం గా పారిశుధ్య సదుపాయాల ప‌రిధి ని మెరుగు ప‌ర‌చ‌డం గురించి ప్ర‌ధాన మంత్రి చెప్తూ, భార‌త‌దేశం త‌న ప్రావీణ్యాన్ని మ‌రియు అనుభ‌వాల ను ఇత‌ర దేశాల తో పంచుకోవ‌డాని కి సిద్ధం గా ఉంది; దీని ద్వారా పారిశుధ్యం స‌దుపాయాల విస్తృతి ని పెంచే దిశ గా ఉమ్మ‌డి కృషి సాధ్య‌పడుతుంద‌న్నారు.

ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ మ‌రియు జ‌ల్ జీవ‌న్ మిశ‌న్‌ ల వంటి కార్యక్రమాల ను ఉద్యమ తరహా లో అమలు చేస్తూ భార‌త‌దేశం ముందు జాగ్రత్త చర్యలతో కూడినటువంటి ఆరోగ్య సంర‌క్ష‌ణ దిశ గా సాగుతోందని ప్ర‌ధాన మంత్రి వెల్లడించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Ayushman driving big gains in cancer treatment: Lancet

Media Coverage

Ayushman driving big gains in cancer treatment: Lancet
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Tamil Nadu meets Prime Minister
December 24, 2024

Governor of Tamil Nadu, Shri R. N. Ravi, met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Governor of Tamil Nadu, Shri R. N. Ravi, met PM @narendramodi.”