‘‘భారతదేశం లో, ప్రకృతి మరియు ప్రకృతి యొక్క స్వభావాలు జ్ఞానార్జన కు మార్గాలు గా ఉంటూ వచ్చాయి’’
‘‘క్లయిమేట్ ఏక్శన్అనేది ‘అంత్యోదయ’ బాట లో సాగాలి; అంత్యోదయ అంటే అర్థం సమాజం లోని చిట్టచివరి వ్యక్తి యొక్కఉన్నతి కి మరియు వృద్ధి కి పూచీ పడడడం అన్నమాట’’
‘‘భారతదేశం 2070 వ సంవత్సరాని కల్లా ‘నెట్ జీరో’ ను సాధించాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొంది’’
‘‘మిశన్ లైఫ్ అనేది ఒక ప్రపంచవ్యాప్త ప్రజా ఆందోళన; అది పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మరియు పదిలపరచడం కోసం వ్యక్తిగత కార్యాచరణ తో పాటు ఉమ్మడి కార్యాచరణ కు ఊతాన్ని ఇస్తుంది’’
‘‘ప్రకృతి మాత ‘వసుధైవ కుటుంబకం’ - ‘ఒక భూమి, ఒక కుటుంబం మరియు ఒక భవిష్యత్తు’ పట్ల మొగ్గు చూపుతుంది’’
చెన్నై లో ఏర్పాటైన జి-20 పర్యావరణం మరియు శీతోష్ణస్థితి మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.
అని చెబుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

చెన్నై లో ఏర్పాటైన జి-20 పర్యావరణం మరియు శీతోష్ణస్థితి మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.

ప్రముఖుల కు చెన్నై నగరం లోకి ఇదే స్వాగతం అని ప్రధాన మంత్రి పేర్కొంటూ చెన్నై నగరం సంస్కృతి పరం గాను మరియు చరిత్ర పరం గాను సుసంపన్నమైన నగరం గా ఉందన్నారు. యూనెస్కో ప్రపంచ వారసత్వ స్థలం అయినటువంటి మామల్లపురమ్ ‘తప్పక చూడవలసిన టువంటి ప్రదేశం’ అని, దానిని దర్శించుకోవాలని వారి కి ఆయన విజ్ఞప్తి చేశారు. అక్కడ రాళ్ల చెక్కడం పనితనం మరియు ఆ శిల్పాల సోయగం స్ఫూర్తి ప్రదాయకాలు అని ఆయన అన్నారు.

 రెండు వేల సంవత్సరాల నాటి మహా కవి తిరువళ్ళువర్ గారు చెప్పిన మాటల ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, ‘‘మహా సముద్రాల జలాల నుండి రూపుదిద్దుకొన్న మేఘాలు ఆ నీటి ని వర్షం రూపం లో మళ్లీ భూమి కి ఇవ్వలేదో సాగరాలు అయినా సరే ఇగుర్చుకుపోతాయ’’ని అన్నారు. ప్రకృతి మరియు ప్రకృతి యొక్క స్వభావం భారతదేశం లో జ్ఞానార్జన కు ఒక నిరంతరాయ వనరు గా నిలుస్తూ వస్తున్న సంగతి ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, మరొక సంస్కృత శ్లోకాన్ని ఉట్టంకించారు.. ‘‘నదులు వాటి లోని జలాల ను త్రాగివేయలేవు, మరి వృక్షాలు వాటి ఫలాల ను ఆరగించ జాలవు. మబ్బులు వాటి లో ఉండే నీటి వల్ల జనించే ధాన్యాన్ని భుజించ లేవు’’ అని శ్లోకార్థాన్ని ఆయన వివరించారు. మనల ను ప్రకృతి పోషిస్తున్నటువంటి కారణం గా ప్రకృతి ని మనం పోషిస్తూ ఉండాలి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. నేల తల్లి ఆలన పాలన మన ప్రధానమైన బాధ్యత గా ఉంది; మరి ఇదే ఈ రోజు న ‘క్లయిమేట్ ఏక్శన్’ గా రూపుదిద్దుకొంది. ఈ కర్తవ్యాన్ని చాలా కాలం నుండి ఉపేక్షిస్తూ రావడమే ఈ స్థితి కి కారణమైంది అని ఆయన అన్నారు. భారతదేశం యొక్క సాంప్రదాయిక జ్ఞానాన్ని పట్టి చూస్తే క్లయిమేట్ ఏక్శన్ అనేది అవశ్యం ‘అంత్యోదయ’ బాట లో సాగవలసి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడ అంత్యోదయ కు అర్థం సమాజం లో ఆఖరు వ్యక్తి కి సైతం ఉన్నతి ని, వృద్ధి ని అందేటట్లు చూడడం అని ఆయన చెప్పారు. జలవాయు పరివర్తన మరియు పర్యావరణ సంబంధి అంశాల వల్ల ఎక్కువ గా ప్రభావితం అవుతున్నది ప్రపంచం లోని ‘గ్లోబల్ సౌథ్’ (అంటే తక్కువ ఆదాయం, అధిక జనాభా. పేలవమైన మౌలిక సదుపాయాలు వెరసి అభివృద్ధిశీల దేశాలు గా వ్యవహారం లో ఉన్న దేశాలు) అని ప్రధాన మంత్రి చెప్తూ, ‘యుఎన్ క్లయిమేట్ కన్ వెన్శన్’ మరియు ‘పేరిస్ ఒప్పందం’ లలో చెప్పుకొన్న సంకల్పాల విషయం లో కార్యాచరణ ను వృద్ధి చెందింప చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని స్పష్టం చేశారు. అదే జరిగితే గ్లోబల్ సౌథ్ దేశాలు వాటి అభివృద్ధి పరమైన మహత్త్వాకాంక్షల ను శీతోష్ణస్థితి పట్ల మిత్ర పూర్వకమైన విధానం లో నెరవేర్చుకోవడం లో సాయపడడం లో కీలకమైన తోడ్పాటు ను అందించినట్లు అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.

భారతదేశం తాను గొప్ప గా నిర్దేశించుకొన్నటువంటి ‘సంకల్పయుక్తమైనటువంటి తోడ్పాటు ల’ ద్వారా మార్గదర్శి గా నిలవడం పట్ల గర్వం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. శిలాజేతర ఇంధన వనరుల నుండి స్థాపిత విద్యుత్తు సామర్థ్యం లక్ష్యాన్ని 2030 వ సంవత్సరాని కల్లా అందుకోవాలని తలచినా అంత కంటే తొమ్మిది సంవత్సరాలు ముందే ఆ లక్ష్యాన్ని సాధించిన సంగతి ని ఆయన ప్రస్తావించి, మరి ఇప్పుడు సవరించిన లక్ష్యాల ద్వారా మరింత ఎక్కువ ఫలితాల పైన దృష్టి ని సారించడం జరిగింది అన్నారు. నవీకరణ యోగ్య శక్తి సంబంధి స్థాపిత సామర్థ్యం విషయం లో భారతదేశం ప్రస్తుతం ప్రపంచం లోని అగ్రగామి 5 దేశాల లో ఒకటి గా ఉంది అని కూడా ఆయన చెప్తూ, 2070 వ సంవత్సరాని కల్లా ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పాన్ని దేశం తీసుకొందన్నారు. ఇంటర్ నేశనల్ సోలర్ అలాయన్స్, సిడిఆర్ఐ, ఇంకా ద ‘లీడర్ శిప్ గ్రూప్ ఫార్ ఇండస్ట్రీ ట్రాంజీశన్ ’ లు సహా, పలు కూటముల ద్వారా భారతదేశం తన భాగస్వామ్య దేశాల తో కలసి ముందుకు సాగిపోతూ ఉండగలదన్న ఆశాభావాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

జీవవైవిధ్యం సంరక్షణ, పరిరక్షణ, పునరుద్ధరణ మరియు సంవర్థనీకరణ అంశాల లో ఎడతెగని కార్యాల ను చేపడుతూ ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ‘‘భారతదేశం ఒక మహా వైవిధ్యయుక్త దేశం’’ అని అభివర్ణించారు. కార్చిచ్చు లు మరియు గనుల తవ్వకం కార్యకలాపాల వల్ల ప్రభావితం అయినటువంటి ప్రముఖ స్థలాల పునరుద్ధరణ కు ‘‘గాంధీనగర్ ఇంప్లిమెంటేశన్ రోడ్ మ్యాప్ ఎండ్ ప్లాట్ ఫార్మ్’’ కార్యక్రమం ద్వారా గుర్తింపు లభిస్తున్నందుకు ఆయన సంతోషాన్నివ్యక్తం చేశారు. భూ గ్రహం లో ఏడు విశిష్ట వ్యాఘ్రాల సంరక్షణ నిమిత్తం ‘ఇంటర్ నేశనల్ బిగ్ కేట్ అలాయన్స్’ ను ఇటీవలే ప్రారంభించిన సంగతి ని ఆయన పేర్కొంటూ, ఈ ఖ్యాతి ‘ప్రాజెక్ట్ టైగర్’ పరం గా అనుభవం లోకి వచ్చిన బోధలకు దక్కుతుంది అన్నారు. ప్రాజెక్ట్ టైగర్ అనేది సంరక్షణ ప్రధానమైనటువంటి కార్యక్రమాల లో అగ్రగామి కార్యక్రమం గా ఉంది. ప్రాజెక్ట్ టైగర్ చలవ తోనే ప్రస్తుతం ప్రపంచ పులుల సంతతి లో 70 శాతం పులులు భారతదేశం లో మనుగడ సాగిస్తున్నాయి అని ఆయన తెలియ జేశారు. ప్రాజెక్ట్ లయన్ మరియు ప్రాజెక్ట్ డాల్ఫిన్ సంబంధి కార్యాచరణ ఒక కొలిక్కి వస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

భారతదేశం లో అమలవుతున్న కార్యక్రమాల కు చోదక శక్తి గా ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉంటున్నది అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ‘మిశన్ అమృత్ సరోవర్’ ను గురించి చెప్పారు. మిశన్ అమృత్ సరోవర్ ఒక అద్వితీయమైనటువంటి జల సంరక్షణ కార్యక్రమం గా ఉంది. దీనిలో భాగం గా ఒక సంవత్సరం కాలం లోనే 63,000 కు పైచిలుకు జల వనరుల ను అభివృద్ధి పరచడమైంది. ఈ కార్యక్రమాన్ని సాంకేతిక విజ్ఞానం అండ తో పూర్తి గా సముదాయ భాగస్వామ్యం ద్వారా అమలుపరచడం జరిగింది అని ఆయన వెల్లడించారు. ‘కేచ్ ద రేన్’ ప్రచార ఉద్యమాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమం సుమారు గా 2,50,000 రీ యూస్ అండ్ రీ ఛార్జ్ స్ట్రక్చర్ స్ ను రూపుదిద్దడం తో పాటుగా 2,80,000 కు పైచిలుకు వాటర్ హార్ విస్టింగ్ స్ట్రక్చర్ స్ ఏర్పాటు కు దారితీసింది అని విరించారు. ‘‘దీనిని అంతటి ని ప్రజల భాగస్వామ్యం తోను, స్థానిక భూ స్థితి ని, జల స్థితి ని లెక్క లోకి తీసుకొని రూపు దిద్దడమైంది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు. గంగ నది శుద్ధి కోసం తలపెట్టినటువంటి ‘నమామి గంగే మిశన్’ లో సముదాయాల భాగస్వామ్యాన్ని ప్రభావవంతం అయినటువంటి రీతి లో వినియోగించుకొంటున్న విషయాన్ని సైతం శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా నది లో అనేక చోట్ల గాంగెటిక్ డాల్ఫిన్ జాడ తిరిగి కనుపించడం ఒక ప్రధానమైన కార్యసాధన గా నిలచింది అన్నారు. మాగాణి నేల ల సంరక్షణ లో 75 భూభాగాల ను రాంసర్ స్థలాలు గా గుర్తించిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆసియా లో రాంసర్ స్థలాల అతి పెద్దదైనటువంటి నెట్ వర్క్ భారతదేశం లోనే ఉంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

‘చిన్నవైన ద్వీప దేశాల’ను ‘పెద్ద సాగర దేశాలు’ గా ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, సాగరాలు ఈ దేశాల కు కీలకమైన ఆర్థిక వనరు గా ఉంటున్నాయి. అంతేకాకుండా యావత్తు ప్రపంచం లో మూడు వందల కోట్ల కు పైచిలుకు ప్రజానీకం యొక్క బ్రతుకుదెరువు కు దన్ను గా నిలుస్తున్నాయి. అపారమైనటువంటి జీవవైవిధ్యాని కి అవి నిలయాలు గా ఉంటున్నాయి అని ఆయన చెప్తూ, మహా సముద్రాల లో లభించే వనరుల ను సంబాళించడం తో పాటు గా బాధ్యతయుక్తమైన రీతి న వినియోగించుకోవడానికి కూడాను ప్రాముఖ్యాన్ని కట్టబెట్టాలి అని నొక్కి పలికారు. ‘‘స్థిరమైనటువంటి మరియు ఆటుపోటుల కు తట్టుకొని నిలచేటటువంటి బ్లూ ఇకానమీ ని మరియు మహాసముద్రాల పై ఆధారపడి ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించడం కోసం ఉద్దేశించిన జి-20 ఉన్నతస్థాయి సూత్రాల కు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వెలిబుచ్చారు. ప్లాస్టిక్ సంబంధి కాలుష్యాని కి స్వస్తి పలకడం కోసం ఒక దీటైన అంతర్జాతీయ స్థాయి లో చట్టపరం గా ఆచరించక తప్పని ఒడంబడిక కై సార్థకమైన కృషి ని చేయవలసిందంటూ జి-20 సభ్యత్వ దేశాల కు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

‘మిశన్ లైఫ్’ - లైఫ్ స్ట‌యిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్ ను ఐక్య రాజ్య సమితి సెక్రట్రి జనరల్ తో కలసి కిందటి సంవత్సరం లో ప్రారంభించిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. మిశన్ లైఫ్ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రజా ఉద్యమం, అది పర్యావరణాన్ని పరిరక్షించడాని కి మరియు పదిలం గా ఉంచడానికి ఊతం గా నిలచేటటువంటి వ్యక్తిగత స్థాయి మరియు సామూహిక స్థాయి కార్యాచరణ ను ప్రేరేపిస్తుందన్నారు. భారతదేశం లో ఏ వ్యక్తి, ఏ కంపెనీ లేదా ఏ స్థానిక సంస్థ అయినా చేపట్టేటటువంటి పర్యావరణ మిత్రపూర్వక కార్యాలు గుర్తింపున కు నోచుకోకుండా ఉండవు అని ప్రధాన మంత్రి అన్నారు. ఇటీవలే ప్రకటించిన ‘గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్’ లో భాగం గా ఇక మీదట గ్రీన్ క్రెడిట్స్ ను సంపాదించుకోవచ్చు అని ఆయన తెలియ జేశారు. మొక్కల పెంపకం, నీటి ని సంరక్షించడం మరియు స‌స్‌టేన‌బల్‌ ఎగ్రికల్చర్ ల వంటి కార్యకలాపాలు ఇప్పుడిక వ్యక్తుల కు, స్థానిక సంస్థల కు మరియు ఇతరుల కు ఆదాయాన్ని సృష్టించి ఇవ్వగలుగుతాయి అని ఆయన వివరించారు.

ప్రకృతి మాత పట్ల మన కర్తవ్యాల ను మనం మరువకూడదని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో పునరుద్ఘాటించారు. ‘జి-20 పర్యావరణం మరియు శీతోష్ణ స్థితి మంత్రుల’ సదస్సు సార్థకం గా, ఫలప్రదం గా నిలుస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘ముక్కచెక్కలు గా ఉండేటటువంటి విధానాన్ని ప్రకృతి మాత మెచ్చుకోదు, ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అదే - ‘ఒక భూమి, ఒక పరివారం, ఒక భవిష్యత్తు’ పట్ల ప్రకృతి మాత మొగ్గు చూపుతుంది.’’ అని చెబుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024

Media Coverage

Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India