A definite change is now visible in India, says PM Narendra Modi
Change in the economic and social content, represents the essence of the New Rules for the New India and the New Economy: PM
India, once mentioned among the ‘Fragile Five’ is now rapidly moving towards becoming a “Five Trillion Dollar” economy: PM
India is playing a key role in the entire world’s growth, the country’s share of the world GDP has risen from 2.4% in 2013, to 3.1% in 2017: PM
A new approach and a new work culture has developed in India: PM Narendra Modi
Speed + Scale + Sensitivity = Success: PM Narendra Modi
Unprecedented investment is being made today in infrastructure, agriculture, technology, health sector, and education sector: PM

‘న్యూ ఎకానమీ – న్యూ రూల్స్’ అంశంపై ఈ రోజు న్యూ ఢిల్లీ లో నిర్వహించిన ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగించారు.

కొద్ది నెలల్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోందని చెప్పిన ప్రధాన మంత్రి, ప్రస్తుతం ఒక ఖచ్చితమైన మార్పు కనిపిస్తోందన్నారు. ఆర్ధిక, సామాజిక భావాల లోని ఈ పరివర్తనే ‘న్యూ ఇండియా మరియు న్యూ ఎకానమీ లకు సంబంధించినటువంటి నూతన నియమాల’ సారాన్ని సూచిస్తోందని ఆయన వివరించారు.

గత నాలుగు సంవత్సరాల కాలంలో, భారతదేశం ‘‘పెళుసైన అయిదు ఆర్థిక వ్యవస్థల’’లో ఒకటిగా ఉంటోందన్న చర్చ కాస్తా భారతదేశం ‘‘అయిదు లక్షల డాలర్ల’’ ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పయనిస్తోందనే వాదం లోకి మారిందని ప్రధాన మంత్రి అన్నారు. యావత్తు ప్రపంచపు వృద్ధి లో భారతదేశం ఏ విధంగా కీలక పాత్రను పోషిస్తున్నదీ తెలిపేందుకు ఆయన వాస్తవాలను, సంఖ్యలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. నామినల్ టరమ్స్ లో ప్రపంచ జిడిపి లో భారతదేశం వాటా 2013 లో 2.4 శాతంగా ఉన్నది కాస్తా 2017 లో 3.1 శాతానికి పెరిగిందని ఆయన తెలిపారు. వేరు వేరు స్థూల ఆర్థిక పరామితులలో భారతదేశం మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఒక కొత్త మార్గాన్ని అనుసరించిన కారణంగాను, ఒక కొత్త పని సంస్కృతిని అలవరచిన కారణంగాను ఈ మార్పు చోటు చేసుకొన్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. భారతదేశం యొక్క స్పర్ధాత్మకతను ఇవాళ యావత్తు ప్రపంచం ప్రమాణీకరిస్తోందని ఆయన చెప్పారు.

శ్రీ నరేంద్ర మోదీ తాను గతంలో ఈ గ్లోబల్ బిజినెస్ సమిట్ కు హాజరైన తరుణంలో, జిఎస్ టి ఇంకా ఒక వీలుపడే ఘటనగానే ఉన్న సంగతిని గుర్తుకు తెచ్చుకొన్నారు. ఇవాళ, అది ఒక వాస్తవంగా మారి, శ్రేష్ఠతరమైన పన్ను అమలు వ్యవస్థ తో పాటు ఒక శ్రేష్ఠతరమైనటువంటి రాబడి వ్యవస్థను కూడా అందించినట్లు ఆయన చెప్పారు. ఇన్ సాల్వెన్సి అండ్ బ్యాంక్ రప్టసి కోడ్ వంటి ఇతరత్రా సంస్కరణలను గురించి కూడా ప్ర‌ధాన మంత్రి ప్రస్తావించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం కావడానికి సూక్ష్మగ్రాహ్యత, వేగం మరియు శ్రేణి ల వంటివి ముఖ్యమని ప్రధాన మంత్రి అన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో వేగం పెరిగిన కొన్ని సందర్భాలను గురించి ఆయన ఉదాహరించారు.

అవస్థాపన, వ్యవసాయం, సాంకేతిక విజ్ఞాగనం, ఆరోగ్య రంగం మరియు విద్య రంగాలలో ప్రస్తుతం మునపు ఎరుగనటువంటి పెట్టుబడులు వచ్చాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఆరోగ్య రంగంలో ‘మిశన్ ఇంద్రధనుష్’, జన్ ఔషధి స్టోర్లు, ఇంకా ‘ఆయుష్మాన్ భారత్’ ల వంటి కార్యక్రమాలను చేపట్టిన సంగతిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

‘డిజిటల్ ఇండియా మిశన్’ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 100 కోట్ల బ్యాంకు ఖాతాలు, 100 కోట్ల ఆధార్ కార్డులు, ఇంకా 100 కోట్ల మొబైల్ ఫోన్ లు.. ఈ మూడు అంశాలు ఒక విశిష్టమైన మరియు ప్రపంచంలో మరే చోటా కనిపించని ఈకోసిస్టమ్ ను ఆవిష్కరిస్తాయన్నారు. ఎమ్ఎస్ఎమ్ఇ రంగం కోసం తీసుకొన్న చొరవలను గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు.

క్రితం సారి ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో తాను చేసిన ప్రసంగంలో అందరికీ గృహ‌ వసతి, అందరికీ విద్యుత్తు, అందరికీ శుభ్రమైన వంట, అందరికీ ఆరోగ్యం, ఇంకా అందరికీ బీమా ల గురించి మాట్లాడినట్లు ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. ఈ విషయంలో గృహ‌ నిర్మాణం, సౌభాగ్య యోజన, ఉజ్జ్వల యోజన మరియు బీమా లకు సంబంధించి తీసుకొన్న చర్యలను ఆయన వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు పేదలకు సాధికారితను ప్రసాదించడానికి ఉద్దేశించినవి అని ఆయన చెప్తూ, మరుగుదొడ్ల నిర్మాణం, ముద్ర యోజన ద్వారా రుణాల పంపిణీ, ఇంకా భూమి స్వస్థత కార్డుల పంపిణీ లను గురించి కూడా ప్రస్తావించారు.

ఇటీవల కేంద్ర బడ్జెటు లో ఎమ్ఎస్ పి ని ప్రకటించిన సంగతిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

వేరు వేరు ఆర్థిక సంస్థలు నియమాలను మరియు నైతిక సూత్రాలను పాటించేటట్టు చూడవలసిన బాధ్యతను వహిస్తున్న వర్గాల వారు, ప్రత్యేకించి తనిఖీ మరియు హెచ్చరికలు చేయవలసిన వర్గాల వారు సంపూర్ణ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలంటూ ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఆర్థిక వ్యవహారాలలో అస్తవ్యస్తతల పై ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకొంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల డబ్బును చట్టవ్యతిరేకంగా కూడబెట్టడం ఆమోదయోగ్యం కాదని, అంతే కాకుండా ఇది ‘‘న్యూ ఎకానమీ- న్యూ రూల్స్’’ యొక్క మూల మంత్రం కూడా అని ఆయన అన్నారు.

 

 

 

Click here to read PM's speech 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi