లక్ష్మణ్ రావ్ ఇనామ్‌దార్ శత జయంతి వేడుకల సందర్భంగా న్యూ ఢిల్లీ లో ఈ రోజు ‘సహకార్ సమ్మేళన్’ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మన దేశం ఒక ‘‘బహురత్న వసుంధర’’, ఎందరో వ్యక్తులు వివిధ ప్రాంతాలలో మరియు వివిధ కాలాలలో గొప్పవైన సేవలను అందించారని చెప్పారు. వారిలో కొందరు సుపరిచితులు, వారిని గురించి ప్రసార మాధ్యమాలు చెప్తూ ఉంటాయి, కాగా తెర మరుగున ఉండిపోయిన మరెందరో విలువైన సేవలను అందించారని ఆయన వివరించారు. అటువంటి వ్యక్తులలో వకీల్ సాహెబ్ లక్ష్మణ్ రావ్ ఇనామ్‌దార్ ఒకరని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అనామకంగా ఉంటున్నప్పటికీ ప్రతి ఒక్కరిని ఏకం చేయాలన్నదే సహకార ఉద్యమంలో ఒకటో సూత్రమని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఈ సూత్రాన్ని శ్రీ ఇనామ్‌దార్ తనలో ఇముడ్చుకొన్నారని, ఆయన జీవితం ప్రేరణను ఇచ్చేటటువంటిదని శ్రీ మోదీ తెలిపారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.61503600_1505978528_pm-modi-at-birth-centenary-celebration-of-laxman-madhav-rao-inamdarji-3.jpg)
2022 కల్లా వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సంతులిత అభివృద్ధిని సాధించడం వంటి లక్ష్యాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహకార ఉద్యమం ఒక కీలక పాత్రను పోషించగలుగుతుందని ఆయన అన్నారు.
సహకార ఉద్యమంలో ఉత్సాహం గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ పదిలంగా ఉన్నదని, ఈ ఉత్సాహాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. ‘‘బినా సంస్కార్, నహి సహకార్’’ (సంస్కారం లేనిదే సహకారం లేదు) అని చెప్పిన శ్రీ ఇనామ్‌దార్ మాటలను ఆయన పునరుద్ఘాటించారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.82773000_1505980174_pm-modi-at-celebration-of-birth-centenary-of-laxman-madhav-rao-inamdarji-and-sahkar-sammelan-6.jpg)
ప్రస్తుతం వ్యవసాయదారుడు రిటైల్ గా కొనుగోలు చేస్తూ, టోకున అమ్మకం జరుపుతున్నాడని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రక్రియను తిరగరాయాల్సి ఉందని, మధ్యవర్తులను తొలగించి ఆదాయాలను పెంచవలసి ఉందని ఆయన వివరించారు. పాడి సహకార సంఘాలను ఒక ఉదాహరణగా చెప్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించే సత్తా సహకార ఉద్యమానికి ఉందని పేర్కొన్నారు. సహకార ఉద్యమం భారతీయ సమాజ స్వభావానికి అనుగుణంగా ఉందని కూడా ఆయన వెల్లడించారు. యూరియాకు వేప పూత, తేనెటీగల పెంపకం, సీ వీడ్ సేద్యం వంటి క్షేత్రాలలో సహకార ఉద్యమం చెప్పుకోదగిన తోడ్పాటును అందించగలుగుతుందని చెప్పారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.56490000_1505978578_pm-modi-at-birth-centenary-celebration-of-laxman-madhav-rao-inamdarji-5.jpg)
ప్రధాన మంత్రి రెండు పుస్తకాలను విడుదల చేశారు. వాటిలో ఒక పుస్తకం శ్రీ లక్ష్మణ్ రావ్ ఇనామ్‌దార్ గురించినదైతే, రెండవ పుస్తకం ‘‘నైన్ జెమ్స్ ఆఫ్ ఇండియన్ కో ఆపరేటివ్ మూవ్‌మెంట్’’ అనే పేరుతో ఉంది. ఈ సందర్భంగా శ్రేష్ఠ సహకార సంఘాలకు పురస్కారాలను కూడా ప్రధాన మంత్రి అందించారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.71204200_1505978627_pm-modi-at-birth-centenary-celebration-of-laxman-madhav-rao-inamdarji-8.jpg)
Cooperative movements are not only about systems. There is a spirit that brings people together to do something good: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 21, 2017
There are several sectors where the cooperative sector can help make a positive difference: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 21, 2017
It is natural for the cooperative sector to grow and shine in India: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 21, 2017