BRICS Business Council Meet: PM Modi pitches for expanding business cooperation between member countries
India is changing fast into one of the most open economies in the world with FDI inflows at an all-time high: PM Modi
GST is India's biggest economic reform ever; in one stroke, a unified market of 1.3 billion people has been created: PM
Digital India, Start-Up India and Make in India are altering economic landscape of India: PM Modi

శ్రేష్ఠులైన,

న్యూ డెవెలప్ మెంట్ బ్యాంక్ అధ్యక్ష‌ులు

బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ సభ్యులారా:

బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తో జరుగుతున్న ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. బిజినెస్ కౌన్సిల్ లో మీరు చేస్తున్న కృషి బ్రిక్స్ భాగస్వామ్యం యొక్క దార్శనికతకు ఒక ఆచరణాత్మకమైన దారిని చూపించడంలో కీలకమైన పాత్రను పోషిస్తోంది. మీరు ఏర్పరిచిన భాగస్వామ్యాలు, మీరు నిర్మించినటువంటి నెట్ వర్క్ లు బ్రిక్స్ లో ప్రతి ఒక్క దేశంలోను ఆర్థిక వృద్ధికి ఊతాన్ని ఇస్తున్నాయి. గత సంవత్సరం గోవాలో జరిగిన ఇదే తరహా సమావేశంలో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ కు ఎన్ డిబి కి మధ్య సన్నిహిత సహకారం ఉండాలన్న సూచన వచ్చింది. మీరు ఎన్ డిబి తో ఒక ఎమ్ ఒయు ను కుదుర్చుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది.

శ్రేష్ఠులు మరియు మిత్రులారా,

ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో అత్యంత ఆంక్ష‌ారహిత ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎంతో వేగంగా మార్పు చెందుతోంది. విదేశీ ప్రత్యక్ష‌ పెట్టుబడి ప్రవాహాలు 40 శాతం మేర వృద్ధి చెందుతూ అపూర్వ స్థాయికి చేరుకున్నాయి. సులువుగా వ్యాపారం చేయడానికి వీలు ఉన్న దేశాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రూపొందించే సూచికలో భారతదేశం పైపైకి ఎగబాకింది. అలాగే, గ్లోబల్ కాంపెటీటివ్ ఇండెక్స్ లో కూడా మేము రెండు సంవత్సరాలలో ఇదివరకటితో పోలిస్తే 32 స్థానాలు ఎగువకు చేరుకున్నాం. జులై నెలలో ప్రవేశపెట్టిన వస్తువులు మరియు సేవల పన్ను భారతదేశంలో అమలుచేసిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ ఒక్కసారిగా 1.3 బిలియన్ ప్రజలతో కూడిన ఏకీకృత విపణిని ఆవిష్కరించాము. ‘డిజిటల్ ఇండియా’, ‘స్టార్ట్ - అప్ ఇండియా’ ఇంకా ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేస్తున్నాయి. ఈ కార్యక్రమాలు భారతదేశం ఒక విజ్ఞాన ఆధారితమైన నైపుణ్యాల అండదండలు ఉన్న సాంకేతిక విజ్ఞానం సాయంతో ముందుకు సాగుతున్న సమాజంగా భారతదేశం రూపొందడంలో తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి.

శ్రేష్ఠులు మరియు మిత్రులారా,

బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ వ్యాపారానికి మరియు పెట్టుబడులకు మార్గాన్ని సుగమం చేసేందుకు నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడేందుకు ‘మౌలిక సదుపాయాల అభివృద్ధి’, ‘చిన్న మధ్య తరహా సంస్థల పురోగతి’, ‘ఇ-కామర్స్’, ఇంకా ‘డిజిటల్ ఎకానమీ’.. వీటన్నింటికి ప్రాధాన్యం ఇస్తోందని తెలుసుకొని నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీరు జరిపిన చర్చలలో ఫలప్రదమైన సిఫార్సులు అనేకం తెర మీదకు వచ్చాయి. బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీ ఏర్పాటుకోసం, శక్తి రంగంలో సహకారం, గ్రీన్ ఫైనాన్స్ లతో పాటు డిజిటల్ ఎకానమీ రంగంలో మీరు జరుపుతున్న కృషి మరీ ముఖ్యంగా ప్రశంసార్హం ప్రభుత్వ అధినేతలుగా నేను మీ ప్రయత్నాలకు మా వంతు పూర్తి మద్ధతును అందిస్తామని చెబుతూ, నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అలాగే, వ్యాపారం మరియు పెట్టుబడి సంబంధిత సహకారాన్ని మెరుగుపరచుకోవాలన్న మా ఉమ్మడి లక్ష‌్యానికి బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ మమ్మల్ని చేరువగా తీసుకు వెళ్ళగలుగుతుందని కూడా మేము భావిస్తున్నాము.

మీకు అందరికీ ధన్యవాదాలు

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi met with the Prime Minister of Dominica H.E. Mr. Roosevelt Skeritt on the sidelines of the 2nd India-CARICOM Summit in Georgetown, Guyana.

The leaders discussed exploring opportunities for cooperation in fields like climate resilience, digital transformation, education, healthcare, capacity building and yoga They also exchanged views on issues of the Global South and UN reform.