యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి గౌరవనీయులు బోరిస్ జాన్సన్ ఎం.పీ. తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు ఫోన్ లో మాట్లాడారు.
ఉక్రెయిన్ లో పరిస్థితి పై ఇరువురు నాయకులు సవివరంగా చర్చించారు. శత్రుత్వాన్ని విడనాడి, సంభాషణల తో కూడిన దౌత్య మార్గాన్ని అనుసరించాలన్న భారతదేశ స్థిరమైన విజ్ఞప్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సమకాలీన ప్రపంచ వ్యవస్థకు ప్రాతిపదికగా అంతర్జాతీయ చట్టంతో పాటు, అన్ని రాష్ట్రాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించడంలో భారతదేశ విశ్వాసాన్ని, ఈ సందర్భంగా మోదీ నొక్కిచెప్పారు.
ఇరువురు నాయకులు ద్వైపాక్షిక ప్రయోజనాలపై కూడా చర్చించారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకునే అవకాశాలపై కూడా వారు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై జరుగుతున్న చర్చల సానుకూల ధోరణి పై ప్రధానమంత్రి మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఇరువురు నాయకుల మధ్య దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన సమవేశంలో ఆమోదించిన 'ఇండియా-యుకె రోడ్‌మ్యాప్ 2030' అమలులో పురోగతిని కూడా నరేంద్ర మోదీ అభినందించారు.
పరస్పరం అనుకూలమైన సమయంలో, సాధ్యమైనంత త్వరగా, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు భారతదేశంలో స్వాగతం పలకాలని ఎదురుచూస్తున్నట్లు, నరేంద్ర మోదీ తన కోరిక ను వ్యక్తం చేశారు.