నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
యూక్రేన్ లో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితుల ను గురించి ఇద్దరు నేత లు చర్చించారు. యూక్రేన్ లో మానవీయ సంక్షోభం కొనసాగుతూ ఉండడం పట్ల వారు వారి ఆందోళనల ను ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకొన్నారు. శత్రుత్వాన్ని ఆపివేసి, చర్చలు మరియు దౌత్యం సంబంధి బాట లోకి తిరిగి రావాలంటూ భారతదేశం నిరంతరం విజ్ఞప్తులు చేస్తూవస్తోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు. రష్యా కు మరియు యూక్రేన్ కు మధ్య జరుగుతున్న చర్చల ను ప్రధాన మంత్రి స్వాగతించారు. వీటి తాలూకు శీఘ్ర పరిష్కారం లభించగలదనే ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.
యుద్ధం చెలరేగుతున్న ప్రాంతాల లో నుంచి భారతీయ పౌరుల ను ఖాళీ చేయించడం, ప్రభావిత ప్రజల కోసం ఔషధాలు సహా ఇతర ఆపద సహాయక సామగ్రి రూపం లో భారతదేశం అందిస్తున్న సహాయం గురించి ప్రధాని శ్రీ మార్క్ రూట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాని శ్రీ మార్క్ రూట్ తో పాటు 2021వ సంవత్సరం ఏప్రిల్ లో తాను పాల్గొన్న వర్చువల్ సమిట్ ను గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. త్వరలోనే ప్రధాని శ్రీ మార్క్ రూట్ కు భారతదేశం లో స్వాగతం పలకాలని వుందంటూ ఆయన తన అభిలాష ను కూడా వ్యక్తం చేశారు.