ఫ్రాన్స్ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఫోన్ ద్వారా మాట్లాడారు.
యూక్రేన్ లో ప్రస్తుత స్థితి ని గురించి ఇద్దరు నేత లు చర్చించారు. యూక్రేన్ లో జరుగుతున్న యుద్ధం పట్ల, అక్కడ మానవీయ స్థితిగతులు దిగజారుతూ ఉండటం పట్ల వారు వారి వారి ఆందోళనల ను ఒకరి తో మరొకరు వెల్లడి చేసుకొన్నారు.
యుద్ధాన్ని విరమించి చర్చల కు మరియు దౌత్యాని కి తిరిగి రావలసిందంటూ భారతదేశం తరఫున పదే పదే చేస్తున్న విజ్ఞప్తుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాని కి, ఐక్య రాజ్య సమితి ప్రణాళిక కు, ఇంకా అన్ని దేశాల ప్రాదేశిక అఖండత్వానికి, సార్వభౌమత్వాని కి ఆదరణ కనబరచడం అనేవి సమకాలీన ప్రపంచ వ్యవస్థ కు మూలాధారాలు గా ఉన్నాయన్న భారతదేశం యొక్క విశ్వాసాన్ని ఆయన ఈ సందర్భం లో నొక్కిచెప్పారు.
ఉభయ పక్షాల మధ్య చర్చలు జరగడాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి అంతరాయాలకు తావు ఉండని విధం గా రాకపోక లు జరిగే వాతావరణాన్ని ప్రజలందరి కి ఏర్పరచడానికి పూచీ పడవలసి ఉంది అని ఆయన స్పష్టం చేశారు.
సంఘర్షణ సాగుతున్న ప్రాంతాల నుంచి భారతదేశం తన పౌరుల ను ఖాళీ చేయించడానికి, ప్రభావిత జనావళి కోసం ఔషధాలు సహా అత్యవసర ఉపశమనకారి సామగ్రి ని పంపడం కోసం భారతదేశం ద్వారా జరుగుతున్న ప్రయత్నాల ను గురించి కూడా అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ దృష్టి కి ప్రధాన మంత్రి తీసుకు వచ్చారు.