యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ చార్ల్ స్ మైకల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఫోన్ ద్వారా మాట్లాడారు.
యూక్రేన్ లో స్థితి దిగజారుతుండడం పట్ల మరియు మానవీయ సంక్షోభం తలెత్తడం పట్ల ప్రధాన మంత్రి మనస్తాపాన్ని వ్యక్తం చేశారు. వైరాన్ని ఆపివేయాలంటూ, చర్చల దిశ గా తిరిగి రావాలంటూ భారతదేశం చేసిన విజ్ఞప్తి ని ఆయన పునరుద్ఘాటించారు.
అంతర్జాతీయ చట్టం, ఐక్య రాజ్య సమితి ప్రణాళిక, అన్ని దేశాల యొక్క ప్రాదేశిక అఖండత్వాన్ని, సార్వభౌమత్వాన్ని గౌరవించడం పైన సమకాలీన ప్రపంచ వ్యవస్థ ఆధారపడి ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
రెండు పక్షాల మధ్య చర్చల ను ప్రధాన మంత్రి స్వాగతించారు. ప్రజలు అందరికి స్వేచ్ఛాయుతమైన మరియు ఎలాంటి అంతరాయాల కు తావు ఉండని రాక పోకల కు అనువైన వాతావరణం ఏర్పడాలి; దీనికోసం పూచీ పడడం అత్యంత అవసరం అని ఆయన నొక్కి చెప్పారు.
ఔషధాలు సహా అత్యవసరమైన ఉపశమనకారి సామగ్రి ని ప్రభావిత ప్రాంతాల కు పంపడం కోసం భారతదేశం చేస్తున్న ప్రయాసల ను గురించి కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.