పోలండ్ అధ్యక్షుడు శ్రీ ఆంద్రెజ్ డూడా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఫోన్ ద్వారా మాట్లాడారు.
యూక్రేన్ నుంచి భారతీయ పౌరుల ను ఖాళీ చేయించడం లో పోలండ్ ద్వారా అందిన సహాయానికి మరియు యూక్రేన్ నుంచి పోలండ్ కు వెళ్లే భారతీయ పౌరుల కోసం వీజా సంబంధి ఆవశ్యకతల లో సడలింపులను అందజేసే ఒక విశిష్ట వ్యవస్థ ను ఏర్పాటు చేసినందుకు అధ్యక్షుడు శ్రీ ఆంద్రెజ్ డూడా కు ప్రధాన మంత్రి ఆత్మీయత నిండినటువంటి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు. ఈ కఠిన కాలం లో పోలండ్ పౌరులు భారతీయుల కు అందిస్తున్నటువంటి స్నేహపూర్ణ స్వాగతాని కి మరియు సౌకర్యాల ను సమకూర్చుతున్నందుకు గాను శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకం గా తన అభినందనల ను వ్యక్తం చేశారు.
రెండు దేశాల మధ్య నెలకొన్న సాంప్రదాయిక మైత్రీ పూర్ణ సంబంధాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ 2001వ సంవత్సరం లో గుజరాత్ లో భూకంపం సంభవించిన వేళ పోలండ్ అందించినటువంటి సహాయాన్ని సైతం గుర్తు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలం లో పోలండ్ కు చెందిన అనేక కుటుంబాలను మరియు అనాథల ను కాపాడడం లో జామ్ నగర్ యొక్క మహారాజా పోషించినటువంటి మార్గదర్శక ప్రాయమైన భూమిక ను కూడా ప్రధాన మంత్రి స్మరణ కు తెచ్చుకొన్నారు.
భారతదేశ పౌరుల ను ఖాళీ చేయించే ప్రయాసల ను పర్యవేక్షించడం కోసం రహదారి రవాణా, రాజమార్గాలు మరియు పౌర విమానయానం శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింహ్ (రిటైర్ డ్) ను పోలండ్ లో తన ప్రత్యేక దూత రూపం లో నియమించడం జరిగింది అని అధ్యక్షుడు శ్రీ ఆంద్రెజ్ డూడా కు ప్రధాన మంత్రి తెలియ జేశారు.
వైరాన్ని అంతం చేసుకొని, సంభాషణ మార్గాని కి తిరిగి రావాలంటూ భారతదేశం పదే పదే చేస్తున్న విజ్ఞప్తి ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు. దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక అఖండత్వాన్ని ఆదరించడాని కి ప్రాధాన్యాన్ని కట్టబెట్టవలసి ఉందనే అంశాన్ని కూడా ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.