గుజరాత్ లో 48,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు జాతికి అంకితం, శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి
కాక్రాపర్ అణు విద్యుత్ కేంద్రంలో రెండు కొత్త ప్రెజరైస్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి: కె ఎ పి ఎస్-3, కె ఎ పి ఎస్-4
గుజరాత్ లో రోడ్డు, రైలు, ఇంధనం, ఆరోగ్యం, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పట్టణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యాటకం మొదలైన రంగాలకు ఊపు నివ్వనున్న కొత్త ప్రాజెక్టులు
వడోదర ముంబై ఎక్స్ ప్రెస్ వే , భారత్ నెట్ ఫేజ్ 2 ప్రాజెక్టుల ముఖ్యమైన విభాగాలను జాతికి అంకితం చేయనున్న ప్రధాన మంత్రి
నవ్సారిలో పిఎం మిత్ర పార్కు నిర్మాణ పనులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
అంబాజీ వద్ద రించాడియా మహాదేవ్ ఆలయం, సరస్సు అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన
అహ్మదాబాద్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో పాల్గొననున్న ప్రధాన మంత్రి
మెహసన లోని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు, దర్శనం చేయనున్న ప్రధాని
వారణాసి , దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి దిశగా రూ. 13,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
వారణాసిలో రోడ్లు, పరిశ్రమలు, టూరిజం, టెక్స్ టైల్స్, ఆరోగ్య రంగాలకు పెద్దపీట
సంత్ గురు రవిదాస్ జన్మస్థలిలో పూజలు, దర్శనం చేయనున్న ప్రధానమంత్రి
బి హెచ్ యు లోని స్వతంత్రతా సభాగర్ లో బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురు, శుక్ర వారాల (2024 ఫిబ్రవరి 22, 23) లో గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటిస్తారు.

ఫిబ్రవరి 22న ఉదయం 10:45 గంటలకు అహ్మదాబాద్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మహేసన చేరుకుని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు, దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహేసనలోని తారాభ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని రూ.8,350 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:15 గంటలకు నవ్సారికి చేరుకుని, అక్కడ రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల జాతికి అంకితం చేసి, శంకుస్థాపన, సుమారు రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన, పనుల ప్రారంభం చేస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ప్రధాన మంత్రి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ను సందర్శిస్తారు. అక్కడ రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను (పిహెచ్ డబ్ల్యుఆర్) జాతికి అంకితం చేస్తారు.

ఫిబ్రవరి 23న వారణాసి బి హెచ్ యు లోని స్వతంత్ర సభగర్ లో సంసద్ సంస్కృత ప్రతియోగితా విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో ప్రధాన మంత్రి పాల్గొంటారు. ఉదయం 11:15 గంటలకు సంత్ గురు రవిదాస్ జన్మస్థలిలో ప్రధాన మంత్రి పూజలు, దర్శనం చేస్తారు. ఉదయం 11:30 గంటలకు సంత్ గురు రవిదాస్ 647వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వారణాసిలో రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రధాని హాజరుకానున్నారు.

గుజరాత్ లో ప్రధాని

గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అహ్మదాబాద్ లోని మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే జిసిఎంఎంఎఫ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో 1.25 లక్షల మంది రైతులు పాల్గొంటారు. జిసిఎంఎంఎఫ్ సహకార సంఘాల స్థితిస్థాపకత, వాటి  వ్యవస్థాపక స్ఫూర్తి, రైతుల బలమైన సంకల్పానికి నిదర్శనం. ఇది అమూల్ ను ప్రపంచంలోని బలమైన డెయిరీ బ్రాండ్లలో ఒకటిగా చేసింది.

గుజరాత్ లో మెహసన, నవ్సారిలో జరిగే రెండు బహిరంగ సభల్లో ప్రధాని రూ.22,850 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం శంకుస్థాపన చేయనున్నారు. గాంధీనగర్, అహ్మదాబాద్, బనస్కాంత, ఆనంద్, మెహసన , కచ్, ఖేడా, భరూచ్, తాపి, వడోదర, సూరత్, నవసారి, పంచమహల్, వల్సాద్, నర్మద జిల్లాల్లో రోడ్డు, రైలు, ఇంధనం, ఆరోగ్యం, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పట్టణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యాటకం వంటి ముఖ్యమైన రంగాలను ఈ ప్రాజెక్టులు కవర్ చేస్తాయి.

మెహసన లోని తారాభ్ లో జరిగే బహిరంగ సభలో,ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటిలో 8000కు పైగా గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందించే భారత్ నెట్ ఫేజ్-2 - గుజరాత్ ఫైబర్ గ్రిడ్ నెట్ వర్క్ లిమిటెడ్:  మెహసన , బనస్కాంత జిల్లాల్లో రైలు మార్గం డబ్లింగ్, గేజ్ మార్పిడి, కొత్త బ్రాడ్-గేజ్ లైన్ కోసం బహుళ ప్రాజెక్టులు; ఖేడా, గాంధీనగర్, అహ్మదాబాద్, మెహసన లో బహుళ రహదారి ప్రాజెక్టులు; గాంధీనగర్ లోని గుజరాత్ బయోటెక్నాలజీ విశ్వవిద్యాలయం ప్రధాన అకడమిక్ భవనం; బనస్కాంతలో అనేక నీటి సరఫరా ప్రాజెక్టులు మొదలైనవి ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి పలు కీలక ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తారు. వీటిలో ఆనంద్ జిల్లాలో కొత్త జిల్లా స్థాయి హాస్పిటల్,  ఆయుర్వేదిక్ హాస్పిటల్;  బనస్కాంతలోని అంబాజీ ప్రాంతంలో రించాడియా మహాదేవ్ ఆలయం,  సరస్సు అభివృద్ధి; గాంధీనగర్, అహ్మదాబాద్, బనస్కాంత, మెహసనలో బహుళ రహదారి ప్రాజెక్టులు; ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్ వే, దీసా; అహ్మదాబాద్ లో హ్యూమన్ అండ్ బయోలాజికల్ సైన్స్ గ్యాలరీ;  గిఫ్ట్ సిటీలో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (జి బి ఆర్ సి) నూతన భవనం;, గాంధీనగర్, అహ్మదాబాద్ , బనస్కాంతలలో నీటి సరఫరాను మెరుగుపరచడానికి బహుళ ప్రాజెక్టులు ఉన్నాయి.

నవ్సారిలో జరిగే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వడోదర ముంబై ఎక్స్ ప్రెస్ వే కు సంబంధించిన పలు ప్యాకేజీలు: భరూచ్, నవ్సారి, వల్సాద్ లో బహుళ రహదారి ప్రాజెక్టులు; తాపిలో గ్రామీణ మంచినీటి సరఫరా ప్రాజెక్టు; భరూచ్ లో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు మొదలైనవి ఇందులో ఉన్నాయి. తదితరాలు. నవ్సారిలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్, అపెరల్ (పీఎం మిత్ర) పార్కు నిర్మాణ పనులను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో భరూచ్-దహేజ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ ప్రెస్ వే;  వడోదరలోని ఎస్.ఎస్.జి ఆసుపత్రిలో బహుళ ప్రాజెక్టులు; వడోదరలో ప్రాంతీయ సైన్స్ కేంద్రం; సూరత్, వడోదర, పంచమహల్ లలో రైల్వే గేజ్ మార్పిడి ప్రాజెక్టులు; భరూచ్, నవ్సారి సూరత్ లలో బహుళ రహదారి ప్రాజెక్టులు; వల్సాద్ లో అనేక నీటి సరఫరా పథకాలు, పాఠశాల,  హాస్టల్ భవనం ,నర్మదా జిల్లాలో ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ పిసిఐఎల్) రూ .22,500 కోట్లకు పైగా వ్యయంతో  కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ (కె ఎ పి ఎస్ ) యూనిట్ 3, యూనిట్ 4లో నిర్మించే రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను (పిహెచ్ డబ్ల్యూఆర్) ప్రధాని జాతికి అంకితం చేస్తారు. కె ఎ పి ఎస్-3,  కె ఎ పి ఎస్-4 ప్రాజెక్టులు 1400 (700*2) మెగావాట్ల సంచిత సామర్థ్యాన్ని కలిగిన అతిపెద్ద స్వదేశీ పిహెచ్ డబ్ల్యూ ఆర్ లు. ఇవి ప్రపంచంలోనే ఉత్తమమైన రియాక్టర్లతో పోల్చదగిన అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ రెండు రియాక్టర్లు కలిపి సంవత్సరానికి 10.4 బిలియన్ యూనిట్ల స్వచ్ఛమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి  గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, గోవా ,  కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ , డామన్ అండ్ డయ్యూ వంటి బహుళ రాష్ట్రాల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తాయి.

వారణాసిలో ప్రధాని

రోడ్డు, రైలు, విమానయానం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, పట్టణాభివృద్ధి, పారిశుధ్యం వంటి ముఖ్యమైన రంగాలకు సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా వారణాసి , దాని పరిసర ప్రాంతాలను మార్చడంపై 2014 నుండి ప్రధాన మంత్రి దృష్టి సారించారు. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ వారణాసిలో రూ.13,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

వారణాసి రోడ్డు కనెక్టివిటీ ని మరింత మెరుగు పరిచే బహుళ రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఎన్ హెచ్ -233లోని ఘర్గ్రా-బ్రిడ్జ్-వారణాసి సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం; ఎన్ హెచ్ -56, ప్యాకేజీ-1లోని సుల్తాన్పూర్-వారణాసి సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం; రోడ్డు ప్రాజెక్టుల ను ప్రారంభించి, పునాది రాయి వేయ నున్నారు. ఎన్హెచ్-56, ప్యాకేజీ-1లోని సుల్తాన్పూర్-వారణాసి సెక్షన్ను నాలుగు లేన్లుగా మార్చడం; ఎన్ హెచ్ -19లోని వారణాసి-ఔరంగాబాద్ సెక్షన్ ఫేజ్-1ను ఆరు లేన్లుగా మార్చడం; ఎన్ హెచ్ -35పై ప్యాకేజీ-1 వారణాసి-హనుమంత సెక్షన్ ను నాలుగు లేన్లుగా మార్చడం; బాబత్ పూర్ సమీపంలోని వారణాసి- జౌన్ పూర్ రైలు మార్గంలో ఆర్ ఒ బి వీటిలో ఉన్నాయి. వారణాసి-రాంచీ-కోల్ కతా ఎక్స్ ప్రెస్ వే ప్యాకేజీ-1 నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు.

ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రధానమంత్రి సేవాపురిలో హెచ్ పిసిఎల్  ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంట్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. యుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ కార్ఖియాన్ లో బనాస్ కాశీ సంకుల్ పాల ప్రాసెసింగ్ యూనిట్; కర్ఖియాన్ లోని యుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ వద్ద వివిధ మౌలిక సదుపాయాల పనులు; చేనేత కార్మికుల కోసం సిల్క్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభిస్తారు.

ప్రధాన మంత్రి వారణాసిలో పలు పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు. రమణ వద్ద ఎన్ టిపిసి ద్వారా చార్ కోల్ కర్మాగారానికి పట్టణ వ్యర్థాలు; సిస్-వరుణ ప్రాంతంలో నీటి సరఫరా నెట్వర్క్  మెరుగుపరచడం; ఎస్ టిపిలు , మురుగునీటి పంపింగ్ స్టేషన్ల ఆన్ లైన్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ , స్కాడా ఆటోమేషన్ వీటిలో ఉన్నాయి. వారణాసి సుందరీకరణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో చెరువుల పునరుద్ధరణ, పార్కుల పునర్నిర్మాణం , 3- డి అర్బన్ డిజిటల్ మ్యాప్ డేటాబేస్ రూపకల్పన ,  అభివృద్ధి ఉన్నాయి.

వారణాసిలో టూరిజం, ఆధ్యాత్మిక టూరిజానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. పది ఆధ్యాత్మిక యాత్రలతో పంచకోషి పరిక్రమ మార్గ్ , పవన్ పథ్ లోని ఐదు పడావ్ లలో ప్రజా సౌకర్యాల పునర్నిర్మాణం; వారణాసి, అయోధ్య కోసం ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ) అందించిన ఎలక్ట్రిక్ క్యాటమరన్ నౌకను ప్రారంభించడం; ఏడు ఛేంజ్ రూమ్ లు తేలియాడే జెట్టీలు , నాలుగు కమ్యూనిటీ జెట్టీలు ఇందులో ఉన్నాయి.  గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా గంగానదిలో పర్యాటక అనుభవాన్ని పెంపొందించడానికి ఎలక్ట్రిక్ కాటమరన్ దోహదపడుతుంది. వివిధ నగరాల్లో ఐడబ్ల్యూఏఐకి చెందిన పదమూడు కమ్యూనిటీ జెట్టీలకు, బల్లియాలో క్విక్ పాంటౌన్ ఓపెనింగ్ మెకానిజానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

ప్రముఖ టెక్స్ టైల్ రంగానికి ఊతమిచ్చేలా ప్రధాన మంత్రి వారణాసిలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్ ) కి  ప్రధాని పునాది రాయి వేయనున్నారు. ఈ కొత్త సంస్థ టెక్స్ టైల్ రంగంలో విద్య, శిక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది.

వారణాసిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ప్రధాన మంత్రి వారణాసిలో కొత్త వైద్య కళాశాలకు పునాది రాయి వేయనున్నారు. బి హెచ్ యు లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఏజింగ్ కు శంకుస్థాపన చేయనున్నారు.  సిగ్రా స్పోర్ట్స్ స్టేడియం ఫేజ్-1, డిస్ట్రిక్ట్ రైఫిల్ షూటింగ్ రేంజ్ లను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు, ఇది నగరంలో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ఒక అడుగు.

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని స్వతంత్ర సభగర్ లో జరిగే బహుమతి ప్రదానోత్సవంలో కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగిత, కాశీ సంసద్ ఫోటోగ్రఫీ ప్రతియోగిత, కాశీ సంసద్ సంస్కృత ప్రతియోగిత విజేతలకు ప్రధాన మంత్రి బహుమతులు ప్రదానం చేస్తారు. వారణాసిలోని సంస్కృత విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం సెట్లు, సంగీత వాయిద్యాలు, మెరిట్ స్కాలర్ షిప్ లను ఆయన పంపిణీ చేయనున్నారు. కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగిత గ్యాలరీని సందర్శించి సన్వర్తి కాశీ ఇతివృత్తంపై ఫొటో ఎంట్రీలతో పాల్గొనే వారితో ముచ్చటిస్తారు.

బి హెచ్ యు సమీపంలోని సీర్ గోవర్థన్ పూర్ వద్ద సంత్ గురు రవిదాస్ జన్మస్థలి ఆలయంలో, పక్కనే ఉన్న రవిదాస్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన సంత్ రవిదాస్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.  సంత్ రవిదాస్ జన్మస్థలి చుట్టుపక్కల సుమారు రూ.32 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు, సంత్ రవిదాస్ మ్యూజియానికి, సుమారు రూ.62 కోట్ల విలువైన పార్కు సుందరీకరణకు శంకుస్థాపన చేస్తారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”