ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ లు 2023 సెప్టెంబరు 9 వ తేదీ న న్యూ ఢిల్లీ లో జి-20 శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతున్న నేపథ్యం లో, గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ ఇన్ వెస్ట్ మంట్ (పిజిఐఐ) మరియు ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఇకానామిక్ కారిడర్ ల కోసం భాగస్వామ్యం అంశం పై ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమాని కి సంయుక్తం గా అధ్యక్షత ను వహించారు.
భారతదేశాని కి, మధ్య ప్రాచ్యాని కి మరియు యూరోపునకు మధ్య మౌలిక సదుపాయాల అభి వృద్ధి తో పాటు గా సంధానాన్ని బలపరచడం కోసం ఇతోధిక పెట్టుబడి ని సమకూర్చాలనే ధ్యేయం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
యూరోపియన్ యూనియన్ , ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, మారిశస్, యుఎఇ మరియు సౌదీ అరేబియాల తో పాటు గా ప్రపంచ బ్యాంకు కు చెందిన నేత లు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల లో మౌలిక సదుపాయాల కల్పన లో గల అంతరాల ను కుదించడం, అలాగే ప్రపంచ వ్యాప్తం గా స్థిరాభి వృద్ధి లక్ష్యాల (ఎస్ డిజిస్) లో పురోగతి ని వేగవంతం చేసే దిశ లో ఉద్దేశించినటువంటి ఒక అభి వృద్ధిప్రధాన మైనటువంటి కార్యక్రమమే ఈ పిజిఐఐ అని చెప్పాలి.
భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతాని కి కలుపుతూ ఒక ఈస్టర్న్ కారిడర్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరోప్ నకు కలిపే ఒక నార్దర్న్ కారిడర్ లు ఐఎమ్ఇసి లో భాగం గా ఉంటాయి. దీనిలో రైలు మార్గం, ఇంకా శిప్-రైలు ట్రాన్జిట్ నెట్ వర్క్ మరియు రహదారి రవాణా మార్గాలు కూడా కలిసి ఉంటాయి.
ఐఎమ్ఇసి అనేది ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, భౌతిక పరమైనటువంటి, డిజిటల్ పరమైనటువంటి మరియు ఆర్థికపరమైనటువంటి సంధానానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి పలికారు. భారతదేశాని కి మరియు యూరోపునకు మధ్య ఆర్థిక ఏకీకరణాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.
ఐఎమ్ఇసి పై ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పైన భారతదేశం, యుఎస్ఎ, సౌదీ అరేబియా, యుఎఇ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్ మరియు జర్మనీ లు సంతకాలు చేశాయి.