ఇక్కడకు విచ్చేసిన ప్రముఖులారా,
ముందుగా పురస్కార విజేతలు అయిదుగురికీ నేను నా హృదయాంతరాళం లో నుంచి అభినందలను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలు టెలివిజన్ లో చూస్తూ వీరు అందరూ తాము రోజూ చూస్తున్న వారేనే అనుకుంటూ అమిత ఆశ్చర్యానికి లోనవుతూ ఉండివుంటారు. మేడమ్ స్పీకర్, ఇంకా ఉపరాష్ట్రపతి కూడా ఈ కార్యక్రమానికి ప్రేక్షకులుగా ఉంటూ ప్రతి ఒక్కరు శాంతంగా ఉన్నందువల్ల నిజంగానే ఎంతో సంతోషిస్తుండవచ్చు. ఇటువంటి వాతావరణమే పార్లమెంటు ఉభయ సభలలో కొలువు దీరుతుందని, సామాన్యుడి బాధలతో అనుబంధాన్ని కలిగివున్న మనమూ మరియు మన పార్లమెంటు సభ్యులూ సభ లో మాట్లాడే అవకాశాన్ని పొందుతారని నేను ఆశిస్తాను. వారి సమస్యలకు ప్రాధాన్యక్రమాన్ని ఇవ్వక తప్పని స్థితిని ప్రభుత్వానికి కల్పిచితీరాలి. పేదల, పల్లెల, అటవీ ప్రాంతాల స్వరాలు ఈ పార్లమెంటు సభ్యుల ద్వారానే ప్రభుత్వానికి వినపడాలి. ఆ వినపడడం అనేది ఎలా ఉండాలి అంటే, వారి భావనలతో ప్రభుత్వం ఏకీభవించి మరి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసేటట్లు ఉండాలి. దురదృష్టవశాత్తు, పార్లమెంటు సభ్యులకు యొక్క ఆ అవకాశం తరచుగా లోపిస్తోంది. అతడు ఎంతో కష్టపడి పని చేసి తన రంగం లో ప్రావీణ్యాన్ని సాధించి వుండవచ్చు. అయితే, గలాభా, గందరగోళం, గొడవ ల వల్ల వాటిల్లే నష్టం దేశానికి ఎంత ఉంటుందో ప్రభుత్వానికి అంతగా ఉండదు. కఠోర శ్రమ అనంతరం ఇక్కడికి వచ్చి కూర్చొన్న ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను గురించి మాట్లాడటానికి సన్నద్ధులు అయినప్పటికీ వారికి మాట్లాడే అవకాశం మాత్రం దొరకడం లేదు. దీంతో గొప్ప నష్టం వాటిల్లుతోంది. కాబట్టి, ఇది ఆ ప్రాంత నివాసులకు సంభవిస్తున్న నష్టమే అని చెప్పాలి. ఈ గందరగోళాన్ని, అయోమయాన్ని టీవీ లో కొద్ది నిమిషాల సేపో లేదా ఒక గంట పాటో లేదా ఒక రోజంతానో ప్రదర్శించడం జరుగుతుంది. ఆ తరువాత అది మరుగునపడి పోతుంది. కానీ, మాట్లాడడానికి అవకాశం దక్కిన ఎంపీ- తాను ప్రభుత్వం పై పదునైన దాడి ని మొదలు పెట్టినప్పటికీ, సభలో ప్రస్తావించేందుకు ఆయన వద్ద కొన్ని అంశాలు సిద్ధంగా ఉన్నప్పటికీ- ఆయన ఆడే మాటలు- చరిత్ర లో ఒక భాగంగా మారిపోతాయి.
ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడు ఆడే మాటలు రికార్డు లో కి ఎక్కే విధంగా జాగ్రత్త పడడం ప్రతి ఒక్కరి బాధ్యత. గ్రామాలకు, పేదలకు, రైతులకు సంబంధించిన అంశాలను పార్లమెంటు సభ్యులు లేవనెత్తి ఆ అంశాల పైన ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పని స్థితిని కల్పించవలసి ఉంది; ఇది మన అందరి బాధ్యత. సభ లో మనం అటువంటి ముఖచిత్రాన్ని ఆవిష్కరించ వచ్చు. వాతావరణం ఎంత ఉత్తమంగా ఉంటే, మన దేశ ప్రజలను ముందుకు తీసుకుపోయేందుకు కావలసిన శక్తి కూడా అంత బలంగానూ ఉంటుంది.
నా అనుభవాన్ని బట్టి చూస్తే, పార్లమెంటు సభ్యులు ఎన్నడూ విలువ లేనిది ఏదీ మాట్లాడలేదు. ఎవరైనా ఏదైనా ఒత్తిడికి లొంగిపోయే లేదా లొంగకుండానో వ్యవహరించివుంటే గనక అది వేరే కథ; రాజకీయంగా మంచి మార్కులు సంపాయించుకోవడానికి ఏ మాటలైనా చెప్పక తప్పని స్థితి ఎవరికైనా ఎదురైవుంటే అది వేరే కథ; కానీ, విధాన రూపకర్తలు ఏదో ఒక సమయంలో దీనిపైన ఆలోచించవలసిన స్థితిని కల్పిస్తుంది. అందుకని పార్లమెంటు సభ్యుడు కావడమనేది అంత సులభమైన విషయం ఏమీ కాదు. వారు 125 కోట్ల మంది భారతీయుల కలలను మరియు తమ ప్రాంతానికి చెందిన ప్రజల సంకల్పాలను- ఉజ్వల భవిష్యత్తు ను కల్పించే వాగ్దానం సహా- మోస్తూ ఉంటారు. ఈ పనిని నెరవేర్చిన అవకాశాన్ని పొందిన వారిని ఈ రోజు సమ్మానించుకోవడం జరుగుతోంది. మన సహచరులు గౌరవాన్ని అందుకొంటున్నారంటే, అటువంటి సహచరులతో కలసి పని చేసినందుకు మనం గర్వపడాలి. మనం సహ కర్మచారులం అనుకొని గర్విద్దాము; మనం ఒకే కాలానికి చెందిన పార్లమెంటు సభ్యులం. ఇది మనకు ఎంతో గర్వకారకం, ప్రతిష్టాత్మకం అయినటువంటి విషయం.
నేను మీకు అందరికీ మరొక్క సారి నా అంతరంగం లోలోపలి నుంచి అభినందనలను తెలియజేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలను అందజేస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు!