“నమో" యాప్‌లోని వినూత్న నవీకృత విభాగంలో పరీక్షలపై చర్చకు సంబంధించిన పరస్పర సంభాషణల సమగ్ర రూపం నుంచి కొత్త ఆలోచనలను గ్రహించవచ్చునని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"నేను మన చైతన్యవంతులైన పరీక్షల యోధులతో సంభాషించడంపై ఎంతో సంతోషిస్తున్నాను. పరీక్షలపై చర్చ అనేది పరీక్షల గురించి మాత్రమేగాక జీవితానికి సంబంధించిన అనేక సమస్యలపై చర్చకు ఒక శక్తిమంతమైన వేదిక. ఈ పరస్పర సంభాషణల నుంచి సరికొత్త ఆలోచనలను నమో యాప్‌లోని వినూత్న నవీకృత విభాగంలో చూడవచ్చు" అని పేర్కొన్నారు.
I enjoy interacting with our dynamic #ExamWarriors.
— Narendra Modi (@narendramodi) April 16, 2022
Pariksha Pe Charcha is a vibrant forum for many issues relating to exams and life.
Insights from all of these interactions can be found in this innovatively curated section on the NaMo App. https://t.co/EegBatrBwJ