వర్చువల్ విధానంలో జరిగిన పరీక్షా పే చర్చ 4వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషించారు. 90 నిముషాలకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల విషయంలో ప్రధానమంత్రి మార్గదర్శకం తీసుకున్నారు. విదేశాల్లో నివశిస్తున్న భారతీయ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ ఏడాది తొలిసారిగా పరీక్షా పే చర్చ కార్యక్రమం వర్చువల్ గా నిర్వహిస్తున్నట్టు తెలియచేసిన ప్రధానమంత్రి కరోనా మనకి ఎన్నో కొత్త మార్గాలు చూపిందన్నారు. విద్యార్థుల మధ్యన కలిసిపోయి ముఖాముఖి మాట్లాడలేకపోవడం నిరాశ కలిగించినా ఈ ఏడాది పరీక్షా పే చర్చ మాత్రం ఆగలేదని చెప్పారు. పరీక్షా పే చర్చ కేవలం పరీక్షల గురించిన చర్చకు పరిమితం కాదని, కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కలిసిపోయి సంభాషించుకుని సరికొత్త విశ్వాసం కూడగట్టుకునే ఒక సందర్భమని ప్రధానమంత్రి అన్నారు.
ये 'परीक्षा पे चर्चा' है, लेकिन सिर्फ़ परीक्षा की ही चर्चा नहीं है! #PPC2021 pic.twitter.com/n5BUsjjKVC
— PMO India (@PMOIndia) April 7, 2021
పరీక్షల భయం ఎలా తగ్గించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎం.పల్లవి, కౌలాలంపూర్ కు చెందిన అర్పణ్ పాండే ప్రధానమంత్రిని అడిగారు. పరీక్షే సర్వం, జీవిత లక్ష్యం అదే అనే వాతావరణం కారణంగానే విద్యార్థుల్లో మితిమీరిన జాగ్రత్త ఏర్పడి భయానికి కారణం అవుతున్నదని శ్రీ మోదీ అన్నారు. జీవితం సుదీర్ఘమైనదని, ఇవన్నీ జీవితంలో వివిధ దశలేనని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దని ఆయన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులకు సూచించారు. ఎవరైనా తమను తాము మదింపు చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా మాత్రమే పరీక్షలను చూడాలని, వాటిని జీవన్మరణ సమస్యగా మార్చకూడదని ఆయన అన్నారు. పిల్లల బలాలు, బలహీనతలు తెలుసుకునే విధంగా వారితో కలిసిపోయి కృషి చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.
M Pallavi and Arpan Pandey ask PM @narendramodi how can we reduce fear?
— PMO India (@PMOIndia) April 7, 2021
This is how the PM responded... pic.twitter.com/ZWWbPg7T3r
కష్టమైన అధ్యాయాలు, సబ్జెక్టుల గురించిన ప్రశ్నకు ప్రధానమంత్రి స్పందిస్తూ విద్యార్థులు ప్రతీ ఒక్క సబ్జెక్ట్ ను ఒకే వైఖరితో చూడాలని, తమలోని శక్తిని అన్నింటికీ సమానంగా పంచాలని సూచించారు. పరీక్షల్లో తేలిగ్గా ఉండే ప్రశ్నలు ముందుగా రాయాలన్న అంశంపై తన అభిప్రాయం స్వల్పంగా విభిన్నమైనదని ఆయన అన్నారు. అత్యంత సంక్లిష్టమైన ప్రశ్నలే ఉల్లాసకరమైన వాతావరణంలో పని చేసే మెదడును ఉపయోగించి రాసినట్టయితే తేలిక ప్రశ్నలు మరింత తేలిక అవుతాయని ఆయన చెప్పారు. తాను ప్రధానమంత్రిగాను, గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగాను ఇదే వైఖరి అవలంబించానని, అత్యంత క్లిష్టమైన అంశాలను ఉదయాన్నే మనసు తాజాగా ఉన్న సమయంలో చేపట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చే వాడినని తెలిపారు. ప్రతీ ఒక్క సబ్జెక్ట్ లోనూ నిష్ణాతులు కావడం ప్రధానం కాదని, ఏదో ఒక సబ్జెక్ట్ పై గట్టి పట్టు సాధించిన వారు కూడా అద్భుత విజయాలు సాధించారని ఆయన అన్నారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ను ఇందుకు ఉదాహరణగా చెబుతూ ఆమె కేవలం సంగీతాన్నే ఏకాగ్ర చిత్తంతో అభ్యసించారని చెప్పారు. ఒక సబ్జెక్టును కష్టమైనదిగా భావించేందుకు పరిమితులేవీ లేవంటూ ఏ ఒక్కరూ వివిధ సబ్జెక్టుల వెంట పరుగులు తీయరాదన్నారు.
ఖాళీగా ఉండే సమయం ప్రాధాన్యత గురించి ప్రధానమంత్రి వివరంగా ప్రస్తావించారు. ఖాళీ సమయానికి తగినంత విలువ ఇవ్వాలని, అది లేనిదే జీవితం ఒక మరయంత్రంగా మారిపోతుందని చెప్పారు. ఖాళీ సమయాన్ని సంపాదించగలిగినప్పుడే ఎవరికైనా దాని విలువ తెలుస్తుందన్నారు. అలాగే ఖాళీ సమయంలో మితిమీరి తినడం వంటి చర్యలను నివారించాలని, అలాంటి అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యమని ఆయన సూచించారు. ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు ఉల్లాసానికి బదులు అలిసిపోతారని చెప్పారు. ఖాళీ సమయాన్ని కొత్త నైపుణ్యాలు అలవరచుకునేందుకు ఉపయోగించుకోవచ్చునని లేదా వ్యక్తిలోని ప్రత్యేక సామర్థ్యాలను వెలికి తీసే అవకాశంగా మలుచుకోవచ్చునని ఆయన సూచించారు.
Free time is the best opportunity to learn new skills. #PPC2021 pic.twitter.com/t9GPgjk7wm
— PMO India (@PMOIndia) April 7, 2021
పిల్లలు చాలా చురుగ్గా ఉంటారనే విషయం తల్లిదండ్రులు గుర్తించాలని ప్రధానమంత్రి సూచించారు. పెద్దలు నోటితో ఇచ్చే ఆదేశాల కన్నా వారి స్వభావం నుంచి మాత్రమే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారని చెబుతూ అందుకే బోధనకు బదులుగా ప్రవర్తన ద్వారా మాత్రమే పిల్లలకు ఏదైనా నేర్పాలని చెప్పారు. తమ ఆదర్శాల ద్వారా పిల్లల్లో స్ఫూర్తిని నింపాలని సూచించారు.
बच्चे बड़े स्मार्ट होते हैं।
— PMO India (@PMOIndia) April 7, 2021
जो आप कहेंगे, उसे वो करेंगे या नहीं करेंगे, यह कहना मुश्किल है, लेकिन इस बात की पूरी संभावना होती है कि जो आप कर रहे हैं, वो उसे बहुत बारीक़ी से देखता है और दोहराने के लिए लालायीत हो जाता है। #PPC2021 pic.twitter.com/Mrk8zuooQE
ప్రతికూల వైఖరితో పిల్లలని భీతావహులను చేసే బదులు వారిలో సానుకూల ఆలోచనలు పెంచేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. పెద్దలు ఏదైనా అంశాన్ని ఎంత సానుకూలంగా తీసుకోవడం అలవరచుకుంటే అంతగా వారి ప్రవర్తనను పిల్లలు కూడా అనుసరిస్తారని తెలిపారు. అందుకే పెద్దలు తమ క్రియాశీలమైన చర్యల ద్వారా పిల్లల్లో మార్పు తేవాలని ఆయన సూచించారు. "సానుకూల దృక్పథం పెంచడం యువత అభివృద్ధికి దోహదకారి అవుతుంది" అని ప్రధానమంత్రి అన్నారు. పిల్లలను ఉత్తేజితం చేయడంలో తొలి అడుగు శిక్షణ అని, చక్కని శిక్షణే ఉత్తేజానికి ముందుంటుందని ఆయన చెప్పారు.
Positive motivation augers well for growth and development of youngsters. #PPC2021 pic.twitter.com/ZsapitURgu
— PMO India (@PMOIndia) April 7, 2021
విద్యార్థులు కలలు సాకారం చేసుకోవాలన్న తీర్మానం చేసుకోవాలని ప్రధానమంత్రి సలహా ఇచ్చారు. ప్రముఖుల వెంట పరుగులు తీసే సమాజ వైఖరి చూసి నిరాశ చెందకూడదన్నారు. మారుతున్న ప్రపంచం ఈ రోజున ఎన్నో అవకాశాలు మన ముందుంచుతున్నదంటూ అలాంటి అవకాశాల పట్ల ఆకర్షితులయ్యే విధంగా తమ వైఖరిని పెంచుకోవాలని సూచించారు. 10, 12 తరగతుల విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా గమనిస్తూ ఉద్యోగాల స్వభావాన్ని అవగతం చేసుకోవాలని, ఆ మార్పులకు అనుగుణంగా శిక్షణ పొంది తమలోని నైపుణ్యాలు తీర్చి దిద్దుకోవాలని చెప్పారు. తమ జీవితమే ప్రధానంగా విద్యార్థులు తమ సంకల్పాన్ని ఎంపిక చేసుకోవాలని, ఈ ప్రయత్నం జరిగినట్టయితే వారి మార్గం మరింత స్పష్టం అవుతుందని శ్రీ మోదీ సూచించారు.
We must resolve to achieve our dreams. #PPC2021 pic.twitter.com/6TtPcjq4qd
— PMO India (@PMOIndia) April 7, 2021
ఆరోగ్యవంతమైన ఆహారం అవసరాన్ని ప్రధానమంత్రి వివరిస్తూ సాంప్రదాయిక ఆహారాల లాభాలు, రుచిని గుర్తించాలని సూచించారు. ఏదైనా అంశం గుర్తుంచుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందిని గురించి ప్రస్తావిస్తూ "ఏ అంశంలో అయినా మమేకం అయి, దాని లోతుల్లోకి వెళ్లి, దానికి మరింత అనుసంధానమై, దానిలోని నిగూఢత్వాన్ని దర్శించడం" ఆలోచనా శక్తిని పదును పెట్టుకోగల మార్గమని ప్రధానమంత్రి అన్నారు. ఏ అంశంతో అయినా అనుసంధానమై, అందులో భాగం అయినప్పుడు దాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని సూచించారు. ఏదైనా అంశాన్ని గుర్తు పెట్టుకోవడానికి బదులు దానితో మమేకం కావడంపై దృష్టి సారించాలని చెప్పారు.
Involve, internalize, associate and visualize. #PPC2021 pic.twitter.com/PeP9OBvksb
— PMO India (@PMOIndia) April 7, 2021
ఎలాంటి ఒత్తిడులు లేని తాజా మనస్సుతో పరీక్షలకు వెళ్లాలని విద్యార్థలను ప్రధానమంత్రి కోరారు. "మీలోని ఆందోళనలన్నింటినీ పరీక్షా హాలుకి బయటే వదిలి వేయండి" అని శ్రీ మోదీ సూచించారు. పరీక్షలకు తాము ఎంత వరకు ప్రిపేర్ అయ్యాం అనే ఒత్తిడి గాని, ఇతర చింతలు గాని లేకుండా వీలైనంత ఉత్తమ మార్గంలో ప్రశ్నలకు జవాబులు రాయాలని ఆయన సలహా ఇచ్చారు.
All your tension must be left outside the examination hall. #PPC2021 pic.twitter.com/XjhtAuLzrh
— PMO India (@PMOIndia) April 7, 2021
"కరోనా వైరస్ సామాజిక దూరాన్ని నిర్బంధం చేసినా కుటుంబాల్లో భావోద్వేగపూరితమైన బంధాన్ని బలోపేతం చేసింది" అని ప్రధానమంత్రి చెప్పారు. ఆ మహమ్మారి కారణంగా మనం ఎంతో పోగొట్టుకున్నా జీవితంలో బంధాలు, ఇతర అంశాల విలువను గుర్తించడం ద్వారా ఎంతో లాభం పొందామన్నారు. ఏ అంశాన్ని తేలిగ్గా తీసుకోకూడదనే విషయం మనం గుర్తించామని చెప్పారు. కుటుంబ విలువ, పిల్లల జీవితాలను తీర్చి దిద్దడంలో పెద్దల పాత్ర ఎలాంటిదో కరోనా కాలం మనకు నేర్పిందన్నారు.
Coronavirus forced social distancing, but it has also strengthened emotional bonding in families. #PPC2021 pic.twitter.com/R1yit0x2mA
— PMO India (@PMOIndia) April 7, 2021
పిల్లలు, వారి తరం గురించి పెద్దలు ఆసక్తి పెంచుకున్నట్టయితే తరాల అంతరం దానికదే తొలగిపోతుందని ప్రధానమంత్రి సూచించారు. పిల్లలు, పెద్దలు పరస్పరం ఏదైనా చెప్పుకోవడంలోను, అవగాహన చేసుకోవడంలోనూ విశాల దృక్పథంతో వ్యవహరించడం అవసరమని చెప్పారు. మనం విశాల దృక్పథంతో మాట్లాడి వారితో మమేకం అయిన అనంతరం మనని మనం మార్చుకునేందుకు సిద్ధం కావాలని సూచించారు.
अपने बच्चे के साथ उसकी generation की बातों में, उतनी ही दिलचस्पी दिखाइएगा, आप उसके आनंद में शामिल होंगे, तो आप देखिएगा generation gap कैसे खतम हो जाती है। #PPC2021 pic.twitter.com/zM4LLLdEZ9
— PMO India (@PMOIndia) April 7, 2021
"మీ జీవితంలో విజయాలు, వైఫల్యాలకు మీ చదువే గీటురాయి కాకూడదు. జీవితంలో మీరేం చేశారో అదే మీ విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది" అని ప్రధానమంత్రి అన్నారు. అందుకే ప్రజలు, తల్లిదండ్రులు, సమాజం ఒత్తిడుల నుంచి పిల్లలు బయటపడాలి అని సూచించారు.
What you study cannot be the only measure of success and failure in your life.
— PMO India (@PMOIndia) April 7, 2021
Whatever you do in life, they will determine your success and failure. #PPC2021 pic.twitter.com/WgTcG9GTIn
"స్థానికం కోసం గళం" ప్రచారంలో భాగస్వాములు కావాలని విద్యార్థులను ప్రధానమంత్రి కోరారు. భారతదేశాన్ని ఆత్మనిర్భర్ చేయడంలో విద్యార్థులు నూరు శాతం మార్కులు సాధించాలని తాను కోరుతున్నట్టు చెప్పారు. అలాగే స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాన్ని గురించి రాయడం ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగస్వాములు కావాలని ఆయన వారిని కోరారు.
Let us make 'Vocal for Local' our mantra for life. #PPC2021 pic.twitter.com/NHJwwLtm7N
— PMO India (@PMOIndia) April 7, 2021
ఈ దిగువన సూచించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానం ఇచ్చారు.
ఎం.పల్లవి-ప్రభుత్వ పాఠశాల, పొదిలి, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్; అర్పణ్ పాండే-గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, మలేసియా; పున్యో సున్యా-వివేకానంద కేంద్ర విద్యాలయ్, పపుంపరే, అరుణాచల్ ప్రదేశ్; శ్రీమతి వినీతా గార్గ్ (ఉపాధ్యాయిని)-ఎస్ఆర్ డిఏవి పబ్లిక్ స్కూల్, దయానంద విహార్, ఢిల్లీ; నీతా అనంత్, కెఎం - శ్రీ అబ్రహాం లింగ్డమ్, వివేకానంద కేంద్రీయ విద్యాలయ మెట్రిక్, కన్యాకుమారి, తమిళనాడు; అక్షయ్ కేకత్ పురే (తండ్రి)-బెంగళూరు, కర్ణాటక; ప్రవీణ్ కుమార్, పాట్నా, బిహార్; ప్రతిభా గుప్తా (తల్లి), లూధియానా, పంజాబ్; తనయ్, విదేశీ విద్యార్థి, సామియా ఇండియన్ మోడల్ స్కూల్, కువైట్; అష్రఫ్ ఖాన్-ముస్సోరీ, ఉత్తరాఖండ్; అమృతా జైన్, మొరాదాబాద్, ఉత్తరప్రదేశ్; సునీతాపాల్ (తల్లి), రాయపూర్, చత్తీస్ గఢ్; దివ్యాంక, పుష్కర్, రాజస్థాన్; సుహాన్ సెహగల్, అహ్లకాన్ ఇంటర్నేషనల్, మయూర్ విహార్, ఢిల్లీ; ధార్వి బోపట్-గ్లోబల్ మిషన్ ఇంటర్నేషనల్ స్కూల్, అహ్మదాబాద్; క్రిస్టీ సైకా, కేంద్రీయ విద్యాలయ, ఐఐటి, గువాహటి; శ్రేయన్ రాయ్, సెంట్రల్ మోడల్ స్కూల్, బరక్ పూర్, కోల్కతా.
Click here to read full text speech