ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్64 పోటీలో క్రీడాకారుడు శ్రీ సుమిత్ అంతిల్ పసిడి పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు అభినందించారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్రీ సుమిత్ ది అసాధారణ ప్రదర్శన. పురుషుల జావెలిన్ ఎఫ్64 పోటీలో పసిడి పతకాన్ని గెలిచినందుకు ఆయనకు ఇవే అభినందనలు. ఆయన అసాధారణ దృఢత్వాన్ని, శ్రేష్ఠత్వాన్ని చాటారు. రానున్న కాలంలో ఆయన పాలుపంచుకొనే పోటీలలో రాణించాలని నేను కోరుకుంటున్నాను.
శ్రీ సుమిత్ అంతిల్, చీర్ ఫర్ భారత్ (@sumit_javelin #Cheer4Bharat).’’
Exceptional performance by Sumit! Congratulations to him for winning the Gold in the Men's Javelin F64 event! He has shown outstanding consistency and excellence. Best wishes for his upcoming endeavours. @sumit_javelin#Cheer4Bharat pic.twitter.com/1c8nBAwl4q
— Narendra Modi (@narendramodi) September 2, 2024