పారిస్ పారాలింపిక్స్ 2024 లో పి2 - మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని రుబీనా ఫ్రాన్సిస్ గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘భారతదేశం గర్వించదగ్గ మరో క్షణం. రుబీనా ఫ్రాన్సిస్ పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో పి2 - మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచారు. ఆమె ఏకాగ్రత, దృఢసంకల్పం, నిరంతర శ్రమ అసాధారణ ఫలితాలను అందించాయి.
చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’
Yet another proud moment for India as @Rubina_PLY wins a Bronze in the P2 - Women's 10M Air Pistol SH1 event at the #Paralympics2024. Her exceptional focus, determination, and perseverance have given outstanding results. #Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) August 31, 2024