భారత యువశక్తి అద్భుతాలు చేయగలదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. వారిలో ఉత్తేజం నింపడంలో, అన్ని అవకాశాలను అందించి వారు రాణించేలా చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
‘మైగవర్నమెంట్ ఇండియా’ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా వ్యాఖ్యానించారు:
“మన యువశక్తి అద్భుతాలు చేయగలదు! వారిని ఉత్తేజితులను చేసి, ఉన్నతులుగా తీర్చిదిద్దే అన్ని అవకాశాలనూ అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం.’’
Our Yuva Shakti can do wonders! And, we are committed to giving them all the opportunities that will make them shine and excel. https://t.co/EDjTManfzh
— Narendra Modi (@narendramodi) November 28, 2024