ప్రజలకు ఉత్తమ నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు అందేటట్టు చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందనీ, సమృద్ధిని పెంచడానికి సంధానానికి ఉన్న శక్తిని వినియోగించుకొంటోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. త్వరలో సిద్ధం కానున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సంధానాన్ని పెంచడంతోపాటు ఎన్‌సీఆర్‌లోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ రాం మోహన్ నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధాని బదులిస్తూ తాను కూడా ఎక్స్‌లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘త్వరలో సిద్ధం కానున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సంధానాన్ని పెంచడంతో పాటే ఎన్‌సీఆర్‌లోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ ‘జీవన సౌలభ్యాన్ని’ కూడా మెరుగురుస్తుంది. ప్రజలకు ఉత్తమ నాణ్యత తో కూడిన మౌలిక సదుపాయాలు అందేటట్టు చూడడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటూ, సమృద్దిని ఇప్పటికన్నా మరింతగా పెంచడానికి సంధానానికున్న శక్తిని వినియోగించుకొంటోంది’’.
The upcoming Noida International Airport will boost connectivity and 'Ease of Living' for the NCR and Uttar Pradesh. Our Government has been taking many steps to ensure top-quality infrastructure for the people and leverage the power of connectivity to further prosperity. https://t.co/YbIqFitb5z
— Narendra Modi (@narendramodi) December 9, 2024